BRS Party : బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి నలుగురు నేతలు

మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, GHMC మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, ప్రొఫెసర్ బానోత్ రమణ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు దీపాదాస్‌ మున్షి.

New Update
BRS Party : బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి నలుగురు నేతలు

Shock For BRS Party : తెలంగాణ(Telangana) ఎన్నికల ఫలితాల్లో దెబ్బ తిన్న బీఆర్ఎస్ పార్టీ(BRS Party) కి వరుస షాకులు ఎదురవుతున్నాయి. కారు దిగిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్న నేతలను కాపాడుకోవడం పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా పలువురు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ALSO READ : త్వరలో ఇంటిటి సర్వే.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

ఆ నలుగురు..

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈ రోజు హస్తం(Congress) లో సభ్యత్వం తీసుకున్నారు నలుగురు నేతలు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి(Patnam Mahender Reddy) దంపతులు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, హైదరాబాద్ GHMC మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, ప్రొఫెసర్ బానోత్ రమణ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి గాంధీ భవన్ లో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్‌ మున్షి. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిశారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేయనున్నట్లు పేర్కొన్నారు.

బీజేపీ వద్దు.. కాంగ్రెస్సే ముద్దు..

సొంత గూటికి చెలమల్ల కృష్ణా రెడ్డి చేరుకున్నారు. దీపదాస్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ ఆశించిన చలమల్ల.. టికెట్ దక్కకపోవడంతో బీజేపీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మునుగోడు అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అదే స్థానం కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన పాల్వాయి స్రవంతి.. టికెట్ దక్కకపోవడంతో బీఅర్ఎస్ లో చేరారు. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కృష్ణా రెడ్డి తిరిగి మూడు రంగుల జెండా కప్పుకున్నారు. త్వరలో పాల్వాయి స్రవంతి కూడా కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం.

ASLO READ : కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌.. కారణం అదేనా..

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు