Sharmila: వైఎస్ షర్మిల, సునీతకు కోర్టు బిగ్ షాక్

AP: షర్మిల, సునీతకు కడప కోర్టు షాక్ ఇచ్చింది. వివేకా హత్య కేసుపై మాట్లాడొద్దని గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ వారికి రూ.10వేల జరిమానా విధించింది.

New Update
Sharmila: వైఎస్ షర్మిల, సునీతకు కోర్టు బిగ్ షాక్

Big Shock For AP PCC Chief Sharmila:ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వివేకా కూతురు సునీతకు కడప కోర్టులో మరోసారి షాక్ తగిలింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు గురించి మాట్లాడొద్దని కడప కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సునీత ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారించిన ధర్మాసనం.. కడప కోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశాలు ఇస్తూ సునీత వేసిన పిటిషన్ కొట్టివేసింది.

ALSO READ: ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా

కాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో గతంలో ఇచ్చిన తీర్పుపై సవాల్ చేస్తూ సునీత, షర్మిల వేసిన పిటిషన్ ను కడప కోర్టు విచారణ చేపట్టింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. వారు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత, షర్మిలకు రూ.10 వేల జరిమానాను కడప కోర్టు విధించింది. జరిమానాను జిల్లా లీగల్ సెల్‌కు కట్టాలని కడప కోర్టు తెలిపింది.

Advertisment
తాజా కథనాలు