BIG BREAKING: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. అన్ని కేసుల్లో ముందస్తు బెయిల్

టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబుకు ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. అలాగే మద్యం కేసులో కొల్లు రవీంద్రకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

BIG BREAKING: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. అన్ని కేసుల్లో ముందస్తు బెయిల్
New Update

TDP Chief Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబుకు అన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఇసుక, మద్యం, ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. అలాగే.. మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్‌ శ్రీనరేశ్‌కూ ముందస్తు బెయిల్‌ మంజూరైంది. షరుతలతో బెయిల్‌ మంజూరు చేసింది. కేసుల గురించి మీడియాతో మాట్లాడవద్దంటూ చంద్రబాబుకు కండీషన్స్‌ పెట్టింది హైకోర్టు.

ఏపీ సీఐడీ (AP CID) టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (IRR), ఇసుక, మద్యం (Liquor Scam) వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ కేసులు నమోదు చేసింది. చంద్రబాబుపై నమోదు అయిన కేసులపై ముందస్తు బెయిల్‌ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో చంద్రబాబు తరఫున లాయర్లు మూడు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు ఈ రోజు (బుధవారం) తన నిర్ణయాన్ని వెలువరించింది.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. సంగతేంటి?

మూడు కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనం రేపిన స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో కొత్త పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ13గా ఉన్న చంద్రకాంత్ షా అప్రూవర్ గా మారారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇప్పటికే చంద్రకాంత్ షా మొబైల్ ఫోన్, డాక్యుమెంట్స్, ల్యాప్ టాప్స్ ఏసీబీ కోర్టుకు సమర్పించారు ఏపీ సీఐడీ అధికారులు. ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ లో సైంటిఫిక్ ఎనాలసిస్ తర్వాత చంద్రకాంత్ షా ను ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టారు. తాను అప్రూవర్ గా మారుతున్నట్లు ఏసీబీ కోర్టుకు ఆయన తెలిపారు. చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డ్ చేయాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. 

డాక్యుమెంట్స్ అడిగిన న్యాయవాదులు..

అప్రూవర్ గా మారిన నిందితుడు చంద్రకాంత్ షాను విచారించే క్రమంలో.. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అడిగారు చంద్రబాబు నాయుడు (Chandrababu) తరపు న్యాయవాదులు. కోర్టుకు సీఐడీ సమర్పించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని కోరారు. దీనిపై పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు న్యాయవాదులను కోర్టు ఆదేశించింది. అప్పటి వరకు చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డు వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. చంద్రబాబు నాయుడు తరుపున న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను కోర్టు ఈ నెల 18కు వాయిదా వేసింది.

                                                                                                   NEWS IS BEING UPDATED 

#tdp #kollu-ravindra #chandrababu-bail #ap-breaking-news #tdp-chief
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe