Pallavi Prashanth: బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్‌కు బిగ్ రిలీఫ్

అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన గొడవ కేసులో పల్లవి ప్రశాంత్‌కు ఊరట లభించింది. తనకు, తన సోదరుడికి పోలీసుల ఎదుట హాజరు నుంచి ఉపశమనం కల్పించాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇకపై పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని నాంపల్లి కోర్టు తీర్పును వెలువరించింది.

New Update
Pallavi Prashanth: బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్‌కు బిగ్ రిలీఫ్

Bigg Boss 7 Pallavi Prashanth: రైతు బిడ్డగా బిగ్ బాస్ సీజన్ 7 లోకి ఎంటర్ అయ్యి విజేతగా నిలిచాడు పల్లవి ప్రశాంత్. తాజాగా అన్నపూర్ణ స్టూడియో (Annapurna Studio) వద్ద జరిగిన గొడవ కేసులో పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. తనకు, తన సోదరుడికి జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరు నుంచి ఉపశమనం కల్పించాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు పల్లవి ప్రశాంత్. నాంపల్లి కోర్టు బెయిల్ లో ఇచ్చిన కండిషన్ రెండు నెలలు పూర్తి అయిందని పిటిషన్ లో పేర్కొన్నారు. రిలాక్సేషన్ కండిషన్ అప్లికేషన్ పిటిషన్ పై విచారణ జరిపిన నాంపల్లి ధర్మాసనం.. పల్లవి ప్రశాంత్, ఆయన సోదరుడు పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని తీర్పును వెలువరించింది.

ALSO READ: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ నేత వీహెచ్

ఈ కేసు యొక్క పూర్తి సమాచారం..

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌గా (Bigg Boss 7 Winner) పల్లవి ప్రశాంత్‌ను ప్రకటించిన తరువాత అన్నపూర్ణ స్టూడియో వద్ద అతని అభిమానులు నానా హంగామా సృష్టించారు. రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సులపై దాడి (Attack On RTC Buses) చేసి, బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లు, ఇతరులకు సంబంధించిన కార్లపైనా దాడులు చేశారు. కార్ల అద్దాలు పగలగొట్టారు. దీంతో పల్లవి ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో బెయిల్ కోరుతూ పల్లవి ప్రశాంత్ తరఫున న్యాయవాదులు పిటిషన్ వేయగా.. శుక్రవారం నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది.

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.15 వేల పూచికత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే, ఈ కేసులో భాగంగా ఆదివారం పోలీసులు ముందు విచారణ కు హాజరు కావాలని ఆదేశించింది కోర్టు.

కాగా, ప్రశాంత్ బెయిల్ పిటిషన్‌పై విచారణ సమయంలో అటు పోలీసులు.. ఇటు ప్రశాంత్ తరఫు న్యాయవాదల మధ్య వాడి వేడి వాదనలు జరిగాయి. పల్లవి ప్రశాంత్‌కు బెయిల్‌ ఇస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేస్తారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించగా.. బయట జరిగిన గొడవతో పల్లవి ప్రశాంత్‌కు సంబంధం లేదన్న అతని తరపు న్యాయవాదులు వాదించారు. అయితే, ప్రశాంత్ రెచ్చగొట్టడం వల్లే అతని అభిమానులు రెచ్చిపోయారని పోలీసుల వాదించారు. అల్లర్లు జరగడానికి పల్లవి ప్రశాంతే కారణమని డీసీపీ విజయ్ స్పష్టం చేశారు. ఆయన రెచ్చగొట్టడం వల్లే ఫ్యాన్స్ రెచ్చిపోయారని, బిగ్‌బాస్‌ నిర్వాహకులను సైతం వదలబోమని స్పష్టం చేశారు డీసీపీ విజయ్.

DO WATCH:

Advertisment
తాజా కథనాలు