Delhi: దిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ! దిల్లీ హైకోర్టులో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆదాయపన్ను శాఖ చర్యకు సంబంధించి దాఖలైన పిటిషన్ ను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే కాంగ్రెస్ వేసిన పలు పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. By Durga Rao 28 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఆదాయపన్ను శాఖ చర్యపై దాఖలైన పిటిషన్ పై కాంగ్రెస్ పార్టీకి(Congress) దిల్లీ(Delhi) హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు గురువారం తిరస్కరించింది. ఆదాయపు పన్ను శాఖ రికవరీ ప్రక్రియకు కౌెంటర్ గా కాంగ్రెస్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఇంతకు ముందు కాంగ్రెస్ పిటిషన్‌ను హైకోర్టు పలు మార్లు తిరస్కరించింది. ఆ పార్టీ వరుసగా మూడేళ్లపాటు ఆదాయపు పన్ను శాఖ, పన్ను రీ-అసెస్‌మెంట్ ప్రొసీడింగ్‌లకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేస్తునే ఉంది. అంతకుముందు, మార్చి 20న విచారణ పూర్తయిన తర్వాత హైకోర్టు నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. 2014-15, 2015-16 , 2016-17 సంవత్సరాలకు ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన పన్ను రీ-అసెస్‌మెంట్ ప్రొసీడింగ్‌లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేసింది. ఆదాయపు పన్ను శాఖ తమ పార్టీ బ్యాంకు ఖాతాలను నిలుపుదల చేసిందని కాంగ్రెస్ నాయకుడు కోశాధికారి అజయ్ మాకెన్ తెలిపారు. గత నెలలో యూత్ కాంగ్రెస్ బ్యాంకు ఖాతా కూడా నిలుపుదల చేసిందన్నారు. 'ప్రస్తుతం మా వద్ద ఖర్చు చేయడానికి, విద్యుత్ బిల్లులు చెల్లించడానికి, మా ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి డబ్బు లేదని అజయ్ మాకెన్ అన్నాారు. ఒకదానికొకటి ముడి పడి ఉండటంతో కోర్టు లో పిటిషన్ ధాఖలు చేసినట్లు వారు తెలిపారు. అయితే, ఐటీ ట్రిబ్యునల్ బుధవారం నాటికి ఖాతాలపై ఫ్రీజ్‌ను తొలగించింది. #congress #petition #delhi-high-court మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి