Bhuvaneshwari: చంద్రబాబును మానసిక క్షోభకు గురిచేయలేరు.. టీడీపీ కార్యకర్తలు మా బిడ్డలు టీడీపీ అంటే ఒక కుటుంబమని, కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వారని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. కార్యకర్తలను ఉద్దేశించి ఆమె ఓ వీడియో విడుదల చేశారు. రాష్ట్రంలో టీడీపీ జెండా రెపరెపలాడటం కోసం కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. By BalaMurali Krishna 25 Sep 2023 in Latest News In Telugu రాజకీయాలు New Update షేర్ చేయండి Bhuvaneshwari: టీడీపీ అంటే ఒక కుటుంబమని, కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వారని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. కార్యకర్తలను ఉద్దేశించి ఆమె ఓ వీడియో విడుదల చేశారు. రాష్ట్రంలో టీడీపీ జెండా రెపరెపలాడటం కోసం కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుపై నిరసనల్లో పాల్గొన్న మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వం ఉందో అర్థమవుతోందని అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న శాంతియుత నిరసనలను సైతం అనుమతించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న అణచివేత ధోరణిని భువనేశ్వరి తీవ్రంగా తప్పుబట్టారు. కార్యకర్తలు మా బిడ్డలతో సమానం.. ఆ బిడ్డలు తల్లిదండ్రుల కోసం నేడు హింసకు గురవుతున్నారని, అక్రమ కేసులకు గురై జైలుకు వెళ్తున్నారనే బాధను వ్యక్తం చేశారు. Your browser does not support the video tag. పార్టీ జెండా రెపరెపలాడాలని వారి జీవితాలనే ఫణంగా పెట్టారని, మహిళలు అన్న సంగతి కూడా మర్చిపోయి పోలీసులు ఇష్టానుసారంగా లాగిపడేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం వైఖరి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ఘటనలే నిదర్శనమన్నారు. టీడీపీ కార్యకర్తలైన మా బిడ్డలు పార్టీకి వెన్నెముకలాంటి వాళ్లని, వాళ్లే లేకుంటే పార్టీ లేదని పేర్కొన్నారు. పోలీసులు ఏం చేసినా తమ బిడ్డలు బెదరరని, టీడీపీ కుటుంబానికి పెద్ద అయిన చంద్రబాబు కోసం బిడ్డల్లాంటి కార్యకర్తలు నిరాహార దీక్ష చేస్తుంటే లాఠీలతో కొట్టడం బాధాకరమన్నారు. దేనికి బెదరకుండా పోరాటం చేస్తున్న, అండగా నిలుస్తున్న కార్యకర్తలందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబును మానసిక క్షోభకు గురిచేయలేరు.. తప్పుడు కేసులతో చంద్రబాబును జైల్లో పెట్టిన ప్రభుత్వం ఆయన భోజనం చేసేందుకు కనీసం టేబుల్ కూడా సమకూర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు భోజనం చేసేందుకు చిన్నపాటి సౌకర్యం కల్పించలేదని వాపోయారు. తమ న్యాయవాది లేఖ రాసిన తర్వాత మాత్రమే ఆయనకు టేబుల్ ఏర్పాటు చేశారని అన్నారు. చంద్రబాబును మానసిక క్షోభకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇలాంటి చిల్లర ఆలోచనలతో ఆయనను ఎవరూ మానసిక క్షోభకు గురిచేయలేరని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. జైలులో ఉన్నా చంద్రబాబు ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో ఉన్నారని వెల్లడించారు. ఇది కూడా చదవండి: జైల్లో చంద్రబాబును చూసి భువనేశ్వరి కంటతడి #tdp #chandrababu #bhuvaneshwari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి