Nara Bhuvaneswari Filed Chandrababu Nomination: టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ ను ఆయన భార్య నారా భువనేశ్వరి కుప్పంలో (Kuppam) దాఖలు చేశారు. ముందుగా పి. ఈ. ఎస్ మెడికల్ కాలేజీ గెస్ట్ హౌస్ నుండి వరదరాజస్వామి ఆలయానికి వెళ్లారు భువనేశ్వరి. ఆలయ కమిటీ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో మంగళ వాయిద్యాల నడుమ భువనేశ్వరికి ఘన స్వాగతం పలికారు.
Also Read: ఆఖరి నిమిషంలో అభ్యర్థుల్ని మార్చేస్తున్న టీడీపీ
చంద్రబాబు నామినేషన్ పత్రాలను వరదరాజాస్వామి పాదాల చెంత పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరదరాజస్వామి దర్శనం అనంతరం శ్రీ పేరుందేవీ తాయర్ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఆలయానికి పెద్ద ఎత్తున చేరుకుని సందడి చేశారు. అనంతరం, భారీ ర్యాలీగా ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.