జగన్‌ కి కృతజ్ఙతలు తెలిపిన భూమన!

టీటీడీ కొత్త చైర్మన్‌ గా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ను కలిశారు. టీటీడీ ఛైర్మన్‌ గా నియమించినందుకు జగన్‌ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

జగన్‌ కి కృతజ్ఙతలు తెలిపిన భూమన!
New Update

టీటీడీ కొత్త చైర్మన్‌ గా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ను కలిశారు. టీటీడీ ఛైర్మన్‌ గా నియమించినందుకు జగన్‌ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

గురువారం ఉదయం తిరుమలలో టీటీడీ ఛైర్మన్‌ గా భూమన బాధ్యతలు చేపట్టనున్నారు. భూమన వెంటన ఆయన కుమారుడు అభినయ్ కూడా ఉన్నారు. ఆగస్టు 8 తో టీటీడీ ఛైర్మన్‌ గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు ముగిశాయి.

దీంతో ఏపీ ప్రభుత్వం భూమనను నూతన ఛైర్మన్‌ గా నియమించింది. గతంలో వైఎస్సాఆర్‌ ఉన్నప్పుడూ కూడా కరుణాకర్‌ రెడ్డి ఛైర్మన్‌ గా పని చేశారు. ప్రస్తుతం భూమన తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు. వైవీ సుబ్బారెడ్డి కూడా టీటీడీ ఛైర్మన్‌ గా రెండు సార్లు బాధ్యతలు స్వీకరించారు.

టీటీడీ పాలకమండలి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో టీటీడీ తదుపరి చైర్మన్‌ ఎవరు దానిపై ఆసక్తికర చర్చ జరిగింది. చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. చివరకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికే ఆ బాధ్యతలు అప్పగిస్తూ జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

అయితే టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్‌ రెడ్డిని నియమించడం గురించి విపక్షాలు మండిపడుతున్నాయి. హిందూ ధర్మం వైపు ఉన్న వారిని మాత్రమే టీటీడీ ఛైర్మన్‌గా నియమించాలని బీజేపీ నేత పురంధేశ్వరి పేర్కొన్నారు.

ఈ క్రమంలో మరి కొంత మంది విపక్ష నేతలు కూడా భూమన నియామకం పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

#chairman #jagan #bhumana-karunakar-reddy #ycp #ttd
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe