BHEL Recruitment 2024: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) సీనియర్ ఇంజనీర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. బీహెచ్ఈఎల్ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 33 పోస్టుల్లో నియామకాలు జరగాల్సి ఉంది. ఈ ఖాళీకి దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు మార్చి 31, 2024లోపు దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ తర్వాత ఎలాంటి ఫారయ్‌ను ఆమోదించరు. కాబట్టి అభ్యర్థులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.bhel.com/recruitment ను విజిట్ చేసి దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్ చేయాలి.
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ విడుదల చేసిన సమాచారం ప్రకారం మొత్తం పోస్టుల్లో 19 సీనియర్ ఇంజనీర్, 10 డిప్యూటీ మేనేజర్, 4 సీనియర్ మేనేజర్ పోస్టుల్లో నియామకాలు జరగనున్నాయి. ఈ పోస్ట్‌లన్నింటికీ దరఖాస్తు చేయడానికి విద్యార్హత, వయోపరిమితి భిన్నంగా ఉంటాయి. అందుకే అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు అర్హత, వయోపరిమితిని జాగ్రత్తగా తనిఖీ చేసి, ఆపై అప్లై చేసుకోవాలి. ఎందుకంటే దరఖాస్తుదారు అర్హత నియమాలలో దేనినైనా పూర్తి చేయకపోతే వారి అప్లికేషన్ ఫారమ్ చెల్లదు.
BHEL ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ 2024: జీతం
--> సీనియర్ ఇంజనీర్- రూ. 70,000-2,00,000
--> డిప్యూటీ మేనేజర్- రూ. 80,000-2,20,000
--> సీనియర్ మేనేజర్-రూ. 1,00,000-2,60,000
ఎలా దరఖాస్తు చేయాలి?
--> ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.bhel.com/recruitment కి వెళ్లాలి.
--> హోమ్‌పేజీలో BHEL రిక్రూట్‌మెంట్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి.
--> అవసరమైన వివరాలను అందించండి.
--> దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి.
--> అవసరమైన పత్రాలను సమర్పించండి.
--> భవిష్యత్తు సూచన కోసం ఇప్పుడు దాని ప్రింట్‌అవుట్‌ని మీ వద్ద ఉంచుకోండి.
Also Read: మార్కెట్లో నకిలీ మందులు.. వేసుకుంటే అంతే గతి.. సిగ్గు లేదా? చావుతో వ్యాపారామా..?