Bhavya sri: భవ్యశ్రీ ఫోరెన్సిక్ రిపోర్ట్స్‌ పై తల్లిదండ్రులు ఎమన్నారంటే..?

భవ్యశ్రీ మృతిపై చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి మాటల్లో వాస్తవాలు లేవని ఆర్టీవీతో భవ్యశ్రీ తల్లిదండ్రులు వాపోతున్నారు. ఎస్పీ ఫోరెన్సిక్ నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు భవ్యశ్రీ తల్లి పద్మ. ఎవరూ ఎన్ని చెప్పినా తన బిడ్డది హత్యేనంటూ ఆక్రోశం వెల్లగక్కారు. పోలీసులు కేసును ప్రక్క దారి పట్టిస్తున్నారని తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. నా బిడ్డ నా వల్లె చనిపోయిందని అంటుంటే గుండె బరువెక్కి పోతుందని వాపోతోంది.

New Update
Bhavya sri: భవ్యశ్రీ ఫోరెన్సిక్ రిపోర్ట్స్‌ పై తల్లిదండ్రులు ఎమన్నారంటే..?

Bhavya Sri News: భవ్యశ్రీ మృతిపై చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి మాటల్లో వాస్తవాలు లేవని ఆర్టీవీతో భవ్యశ్రీ తల్లిదండ్రులు వాపోతున్నారు. ఎస్పీ ఫోరెన్సిక్ నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు భవ్యశ్రీ తల్లి పద్మ. ఎవరూ ఎన్ని చెప్పినా తన బిడ్డది హత్యేనంటూ ఆక్రోశం వెల్లగక్కారు. పోలీసులు కేసును ప్రక్క దారి పట్టిస్తున్నారని తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. నా బిడ్డ నా వల్లె చనిపోయిందని అంటుంటే గుండె బరువెక్కి పోతుందని వాపోతోంది. ఎస్పీ చూపిన దుస్తులు నా బిడ్డ ధరించింది కాదని వెల్లడించింది. నా బిడ్డ మృతిదేహంపై దుస్తులు రీ-ప్లేస్ చేశారని అంటోంది. నేను కొట్టడం,మందలించడం వల్లే నా బిడ్డ ఆత్మహత్య చేసుకుందని అంటున్నారని..అయితే, నా కారణంగానే నా కూతురు చనిపోయింటే సీబీఐ ఎంక్వైరీ ఎందుకు కోరుతానంటూ ప్రశ్నించింది. ఎస్పీ మాటల్లో ఏ మాత్రం వాస్తవాలు లేవని వాపోతోంది. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తా అంటూ వ్యాఖ్యనించింది. పోలీసులపై తనకు నమ్మకం లేదని,సీబీఐ విచారణ కోరుతానని తెలిపింది.

Also Read: భవ్యశ్రీ మృతిపై ఎస్పీ రిషాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!! అసలు ఏలా చనిపోయిందంటే..?

తిరుపతిలో సంచలనం సృష్టించిన భవ్యశ్రీ మృతి ఆత్మహత్యేనని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి చెప్పారు. భవ్యశ్రీది ఆత్మహత్యేనని.. తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని ఎస్పీ రిషాంత్ రెడ్డి వెల్లడించారు. ఇంటర్ విద్యార్థి భవ్యశ్రీ కేసులో ఫారెన్సీక్ రిపోర్ట్స్ చూపిన ఎస్పీ..రిపోర్ట్స్ చాలా క్లియర్ గా బావిలో నీరు తాగి మరణించినట్లు వుందిని తెలిపారు. ఎవ్వరూ భవ్యశ్రీని అఘాయిత్యాం చేయలేదని చెప్పారు. అనుమానం వ్యక్తం చేసిన నలుగురుని విచారించామని పేర్కొన్నారు. నలుగురు లొకేషన్ లో ఖచ్చితంగా లేరు అని టవర్ రిపోర్ట్స్ వున్నాయని వ్యాఖ్యనించారు. ఎవరికి అయినా అనుమానం వుంటే రిపోర్ట్స్ ఇస్తామని చెప్పారు. అయితే, ఈ కేసును ఇంకా క్లోజ్ చేయడం లేదని..ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితిలు, ప్రభావితం చేసిన వ్యక్తులను గుర్తిస్తామని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే ఈ కేసులో ఏ ఒత్తిడి జరగలేదని, ప్రాపర్ గా దర్యాప్తు జరిగిందని వెల్లడించారు. భవ్యశ్రీ మృతిపై తల్లిదండ్రులు కోర్టుకు వెళ్తాం అనడం వారి వ్యక్తిగతం విషయని అన్నారు. సీబీఐ వచ్చిన మా వద్ద వున్న క్లీన్ రిపోర్ట్స్ ఇస్తామని చెప్పారు.

Advertisment
తాజా కథనాలు