ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో.. భట్టి కీలక వ్యాఖ్యలు!

ఖమ్మం జిల్లాలో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తుందన్నారు.

New Update
ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో.. భట్టి కీలక వ్యాఖ్యలు!

Bhatti Vikramarka Comments : ఈరోజు ఖమ్మం(Khammam) లో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం అమలులో భాగంగా ఖమ్మం పాత బస్టాండ్‌లో మహిళలకు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ఆర్టీసీ బస్సులను వారు ప్రారంభించారు.

ALSO READ: రుణమాఫీ అవుతుందా మాస్టారు?.. తెలంగాణలో గుసగుసలు

అనంతరం ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఆరోగ్య శ్రీ(Arogyasri) పథకాన్ని ప్రారంభించారు మంత్రులు. భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో మరిన్ని హామీలు పొందుపరిచినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రబుత్వంపై బురద చల్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని అన్నారు. ఆరు గ్యారంటీలకు వారంటీ లేదని బీఆర్ఎస్ విమర్శించిందని ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే ఆరు గ్యారంటీలను మొదటి వంద రోజుల్లో అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని ఖమ్మం నుంచి తెలంగాణ ప్రజానీకానికి తెలిపారు.

రెవేన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మొన్నటి ఎన్నికల్లో తమను నమ్మి ఓటు వేసి అద్భుతమైన విజయాన్ని అందించన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని.. ఇప్పుడు రెండు పధకాలను అమలు చేశామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ స్కీమ్‌లను ప్రారంభించామని వెల్లడించారు.

ALSO READ: కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి..

Advertisment
తాజా కథనాలు