Bharat Rice: ప్రస్తుతం ధరలు భారీగా పెరిగాయి. ఇక బియ్యం ధరలకు (Rice Prices) అయితే రెక్కలు వచ్చాయి. దేశమంతటా వరి ఉత్పత్తి భాగానే ఉన్నప్పటికీ..బియ్యం ధరలు మాత్రం దిగడం లేదు. రోజురోజుకూ పెరుగుతూ సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో సామాన్యులకు ఊరట కల్పించేందుకు కేంద్రం భారత్ రైసును (Bharat Rice) అందుబాటులోకి తీసుకువచ్చింది. పేద, సామాన్య ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు భారత్ బ్రాండ్ పేరుతో బియ్యాన్ని తీసుకువచ్చింది. కిలో బియ్యాన్ని రూ. 29 రూపాయలకే విక్రయిస్తున్నారు. ఈ బియ్యం విక్రయాలను ఇప్పటికే ప్రారంభించారు.
నేషనల్ అగ్రికల్చర్ కోపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED), నేషనల్ కోపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF), కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాలతో పాటు మొబైల్ ఔట్‌లెట్లలో ఈ బియ్యం విక్రయిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో ఈ బియ్యం కేంద్రాలు ఎక్కుడున్నాయి? అందరూ వీటి గురించే సెర్చ్ చేస్తున్నారు. కోఠిలో (Koti) కేంద్రీయ భండార్, గన్‌పార్క్ (Gun Park) సమీపంలో NAAFED, సుల్తాన్ బజార్‌లో ఎన్ సీసీఎఫ్ ( NCCF) ఉంది. ఈ కేంద్రాల్లో భారత్ రైస్‌ను విక్రయించనున్నారు. త్వరలోనే మొబైల్ ఔట్ లైట్ ద్వారా కూడా బియ్యాన్ని విక్రయిస్తారు.
వీటితోపాటు ఈ-కామర్స్‌లో కూడా భారత్ బ్రాండ్ బియ్యాన్ని విక్రయిస్తారు. ఆమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart), జియోమార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లలోనూ భారత్ రైన్‌ను మనం ఆర్డర్ చేస్తుకోవచ్చు. అయితే...ప్రస్తుతానికైతే అందుబాటులో లేవు. త్వరలోనే ఈ కామర్స్‌లో అమ్మకాలు ప్రారంభం అవుతాయి. 5 కేజీలు, 10 కేజీల బ్యాగుల్లో భారత్ రైస్ లభిస్తాయి. తొలి దశలో రిటైల్ మార్కెట్లో 5 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయిస్తామని కేంద్రం తెలిపింది. ప్రస్తుతంర్కెట్లో కిలో సన్న బియ్యం రూ.60-70 పలుకుతోంది. భారత్ రైస్‌ను 29కే విక్రియిస్తుండంతో సామాన్యులు షాపుల ముందు క్యూ కడుతున్నారు.
ఇది కూడా చదవండి: ఎన్నికలకు ఒకరోజు ముందు పాకిస్థాన్‌లో భారీ పేలుడు, 26 మంది దుర్మరణం..!!
బియ్యం ధరలను అరికట్టేందుకు కూడా కేంద్రం చర్యలు చేపట్టింది. బియ్యం ధరలు తగ్గే వరకు ఎగుమతులపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం వెల్లడించింది. రిటైలర్లు, హోల్ సేలర్లు, ప్రాసెసర్లు ప్రతి శుక్రవారం స్టాక్ వివరాలను మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.