G20 Summit: జీ 20 సదస్సులో మోడీ ముందు 'భారత్' నేమ్ ప్లేట్! ప్రధాని మోడీ కూర్చుని ఉన్న సీటు ముందు ''భారత్'' అనే నేమ్ ప్లేట్ కనిపించింది. ఈ అంశం గురించి ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది. By Bhavana 09 Sep 2023 in నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి Modi uses 'Bharat' for G20 Nameplate: జీ 20 సమావేశాలు ఢిల్లీ నగరంలో అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభానికి ముందు దేశ ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) మొరాకా భూకంప మృతులకు నివాళులు ఆర్పించారు. ఈ సమావేశాలు ప్రారంభం కాక ముందే నుంచే ఓ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే ''భారత్''...ఇండియా పేరును భారత్ గా మార్చుతున్నట్లు కొద్ది రోజుల క్రితం నుంచి తెర మీదకు వచ్చింది. ఈ క్రమంలోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఓ ఆహ్వాన పత్రిక మీద ముద్రించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే మోడీ ఇండోనేషియా పర్యటనకు సంబంధించిన ఓ పత్రం మీద కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అనే ముద్రించారు. దీంతో జీ 20 సమావేశాలు (G20 Meetings) వేదికగా ఇండియా పేరును భారత్ అని మార్చుతున్నట్లు అందరూ భావించారు. ఆ ప్రచారానికి వాస్తవమేనన్న సంకేతం జీ20 సదస్సులో కనిపించింది. ఎందుకంటే ప్రధాని మోడీ కూర్చుని ఉన్న సీటు ముందు ''భారత్'' అనే నేమ్ ప్లేట్ కనిపించింది. ఈ అంశం గురించి ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది. ఇండియా పేరును భారత్ గా ఐక్యరాజ్య సమితి రికార్డుల్లో నమోదు చేస్తామని ప్రకటించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడానికి గల కారణాలను, సమావేశాల అజెండాను మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటించింది లేదు. ఈ అంశం గురించి సోనియా గాంధీ సైతం మోడీకి ఓ లేఖ ను కూడా రాశారు. అయితే దేశం పేరును మార్చుతున్నట్లు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. మరోవైపు ‘భారత్’ అంశంపై రాజకీయ వివాదానికి తావివ్వకుండా చూడాలని ప్రధాని మోడీ తన సహచర మంత్రులను కోరారు. Also Read: జీ20 సమ్మిట్ లవ్ అప్డేట్స్ #modi #bharat #india #g20-summit #modi-uses-bharat-for-g20-nameplate మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి