Bhaje Vaayu Vegam : ఆసక్తి రేపుతున్న'భజే వాయు వేగం' ట్రైలర్.. యాక్షన్, ఎమోషన్ తో అదరగొట్టిన కార్తికేయ!

కార్తికేయ త్వరలోనే 'భజే వాయు వేగం' అంటూ మరో సరికొత్త థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మే 31 విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ యాక్షన్, ఎమోషన్ అంశాలతో సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది.

New Update
Bhaje Vaayu Vegam : ఆసక్తి రేపుతున్న'భజే వాయు వేగం' ట్రైలర్.. యాక్షన్, ఎమోషన్ తో అదరగొట్టిన కార్తికేయ!

Bhaje Vaayu Vegam Trailer : 'RX 100' సినిమాతో హీరోగా ఓవర్ నైట్ పాపులర్ అయిన కార్తికేయ (Karthikeya) గత ఏడాది 'బెదురులంక' అనే సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత త్వరలోనే 'భజే వాయు వేగం' అంటూ మరో సరికొత్త థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మే 31 విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ (Cinema Trailer) ని తాజాగా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది.

యాక్షన్ తో పాటూ ఎమోషన్ కూడా

తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో ఫాదర్ సెంటిమెంట్ హైలైట్ అయింది. సినిమా అంతా డబ్బు చుట్టే తిరుగుతుందని ట్రైలర్ లో చూపించారు. తండ్రికి ఆపరేషన్ చేయించాలని కొడుకు పడే ఇబ్బందులను థ్రిల్లింగ్ గా చూపిస్తూనే ఎమోషనల్ గానూ కనెక్ట్ అయ్యేలా కొన్ని సీన్స్ చూపించారు. సినిమాలో కార్తికేయతో పాటూ హ్యాపీడేస్ మూవీ ఫేమ్ రాహుల్ (Rahul) కీలకపాత్ర పోషించాడు.

మొత్తంగా 'భజే వాయు వేగం' ట్రైలర్ యాక్షన్, ఎమోషన్ అంశాలతో సాగుతూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. యూవీ క్రియేషన్స్ (UV Creations) సమర్పణలో యువీ కాన్సెప్ట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకి ప్రశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహించగా.. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది.

Also Read : ప్రభాస్ ను రిజెక్ట్ చేసిన అనుష్క.. షాక్ లో ఫ్యాన్స్?

Advertisment
తాజా కథనాలు