రాజస్థాన్ కొత్త సీఎంగా భజన్ లాల్ శర్మను (Bhajanlal Sharma) బీజేపీ ఎంపిక చేసింది. జైపూర్‌లో ఈ రోజు బీజేఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకుడిగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరయ్యారు. సమావేశంలో భజన్ లాల్ శర్మ పేరును రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. అయితే.. ముఖ్యమంత్రి పదవి కోసం వసుంధర రాజే, దియా కుమారి, బాలక్‌నాథ్, గజేంద్ర సింగ్ షెకావత్ తదితరులు పోటీ పడ్డారు.
ఇది కూడా చదవండి: Mahua Moitra: కాంగ్రెస్ ఎంపీకీ బిగ్ షాక్.. 30 రోజుల్లో ఆ బంగ్లా ఖాళీ చేయాలని ఆదేశాలు
వసుంధర రాజేకు దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారన్న ప్రచారం కూడా సాగింది. అయితే ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో కొత్త వారికి అవకాశం ఇచ్చిన బీజేపీ హైకమాండ్ ఇక్కడ కూడా కొత్త వారి వైపే మొగ్గు చూపింది. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భజన్ లాల్ శర్మను బీజేపీ రాజస్థాన్ సీఎంగా ఎంపిక చేసి సంచలనం సృష్టించింది.
డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్‌చంద్ ను ఎంపిక చేసింది. బీజేపీ ఎల్‌పీ సమావేశానికి ముందే వసుంధరరాజే రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. భజన్‌లాల్ శర్మ విషయానికి వస్తే సంగనేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాలుగు సార్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.