A snatcher was snatching a passenger's phone from a moving train: అమాయకంగా ట్రైన్ ఎక్కుతారు.. ప్రయాణికులలాగే కూర్చుంటారు. ఏం తెలియనట్టు ఫేస్ పెడతారు. ఎవరి మెడలో ఏ చైన్ ఉందో ఓ లుక్కేస్తారు.. ట్రైన్ ఎక్కడ స్లో అవుతుందో తెలుసు.. ఎక్కడ చోరీ చేయాలో తెలుసు.. టైమ్ చూసి చైన్ స్నాచ్ చేసి ట్రైన్‌లో నుంచి దూకి పరార్ అవుతారు. ఇలాంటి ప్లాన్‌తోనే భాగల్‌పూర్ ట్రైన్ ఎక్కాడు దొంగ.. కానీ అడ్డంగా దొరికపోయాడు.. అయితే చివరకు మాత్రం ప్రయాణికులను బోల్తా కట్టించాడు.
అసలేం జరిగిందంటే?
వైరల్ అవుతున్న వీడియో బీహార్(Bihar)లోని భాగల్‌పూర్(Bhagalpur)కి చెందినది. భాగల్‌పూర్ స్టేషన్‌లో ప్యాసింజర్ రైలులో ఓ మహిళా ప్రయాణికురాలి మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోయేందుకు దొంగ ప్రయత్నించాడు. కానీ, అతను తప్పించుకోలేకపోయాడు. రైలు లోపల నుంచి ఒక ప్రయాణికుడు కిటికీలోంచి అతని చేతిని పట్టుకున్నాడు. స్నాచర్‌ని మిగిలిన ప్రయాణికులు కొట్టడం ప్రారంభించారు. ట్రైన్ కిటికీకి వేలాడుతూనే దెబ్బలు తిన్నాడు. స్నాచర్ తన చేతులు విడిచిపెట్టమని ప్రయాణికులను వేడుకున్నాడు. కానీ, అతనికి గుణపాఠం చెప్పేందుకు ప్రయాణికులు కనికరించలేదు.
లాస్ట్‌లో ట్విస్ట్:
సుమారు కిలోమీటరు వెళ్లాక చైన్ లాగి రైలును నిలిపివేశారు ప్రయాణికులు. అదే సమయంలో కొందరు వ్యక్తులు స్నాచర్‌ను రైలు నుంచి కిందకు దించి కొట్టి తీసుకెళ్లారు. విముక్తి కల్పిస్తామనే నెపంతో అతడిని కొట్టి తీసుకెళ్లింది మరెవరో కాదు.. అతని సొంత గ్యాంగ్ సభ్యులే. ఈ విషయం తెలియక ప్రయాణికులు వారిని నమ్మారు.
Also Read: అద్దంకి దయాకర్ కు షాక్ ఇచ్చిన కాంగ్రెస్
WATCH: