Viral News: మద్యం మత్తులో ప్రిన్సిపల్‌.. విద్యార్థులు ఏం చేశారో తెలిస్తే షాకే!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం జీపీపల్లి గ్రామంలో విచిత్ర ఘటన జరిగింది. మద్యం సేవించి స్కూల్‌కు వచ్చిన ప్రిన్సిపల్‌ను విద్యార్థులు నిర్భందించారు. ప్రిన్సిపల్‌ నిర్వాకంపై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులకు కంప్లైంట్ అందింది. ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

Viral News: మద్యం మత్తులో ప్రిన్సిపల్‌.. విద్యార్థులు ఏం చేశారో తెలిస్తే షాకే!
New Update

Viral News: ఇటివలి కాలంలో స్కూల్స్‌కు తాగేసి వస్తున్న టీచర్ల గురించి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లే విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనల అనేక చోట్ల జరుగుతున్నాయి. ముఖ్యంగా తాగి క్లాసులకు రావడమంటే అది చాలా పెద్ద తప్పు. అసలు తాగడం మంచిది కాదని పిల్లలకు టీచర్లే చెప్పాలి. మద్యపానం వల్లే వచ్చే సమస్యల గురించి వివరించాలి. అప్పుడే పిల్లలకు అది ఎంత హానికారమో తెలుస్తుంది. అయితే కొంతమంది టీచర్లకు ఇలాంటివి ఏమీ పట్టవు. తాగేసి క్లాసులకు రావడం.. పిల్లలను ఇష్టారీతిన బాదడం కొంతమందికి అలవాటుగా మారింది. ఇలాంటి ఘోరాలను చూస్తున్న పిల్లల్లో టీచర్‌పై కోపం పెరుగుతోంది. అది ఏదో ఒక రోజు తిరుగుబాటుకు కారణం అవుతుంది. టీచర్‌ను తరిమితరిమి కొట్టే వరకు తీసుకెళ్తుంది. నిన్న ఛత్తీస్‌గఢ్‌ ఘటన ఎంత వైరల్‌గా మారిందో తెలిసిందే. తాజాగా మన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ అలాంటి ఘటనే వెలుగు చూసింది.

This browser does not support the video element.

ప్రిన్సిపల్‌ను బంధించారు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం జీపీ పల్లి గ్రామంలో విచిత్ర ఘటన జరిగింది. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాణోత్ కృష్ణ మద్యం సేవించి స్కూల్‌కకు వచ్చాడు. చేసిందే పాపం.. అందులోనూ ప్రిన్సిపల్‌.. ఇది సరిపోనట్టు పిల్లలను కొట్టడం మొదలు పెట్టాడు. తాగేసి ఉన్నాడు కదా.. అందుకే విచక్షణా లేకుండా పిల్లను బాదాడు. ప్రిన్సిపల్‌ తాగి ఉన్నాడని విద్యార్థులకు అర్థమైంది. ఎందుకంటే ఆయన నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. అటు ఇటు తూలుతున్నారు. ఇదంతా తాగుబోతులే చేస్తారని విద్యార్థులకు తెలుసు. అందుకే ప్రిన్సిపల్‌పై అంతా ఒక్కసారిగా తిరగబడ్డారు. ముందుగా ఈ విషయం గురించి తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.

This browser does not support the video element.

చర్యలు తప్పవు:

ఆ తర్వాత స్థానికుల సహకారంతో కృష్ణను నిర్భంధించారు విద్యార్థులు. ఆయన్ను ఒక చోట ఉంచి అక్కడ గేటుకు లాక్ వేశారు. మత్యం మత్తు దిగిన తర్వాత కృష్ణకు అసలు విషయం బోధపడింది. గేటు లాక్‌ ఓపెన్ చేయాలని విద్యార్థులను బతిమలాడారు. తర్వాత పేరెంట్స్‌ అక్కడికి చేరుకున్నారు. ఇంతలో ప్రిన్సిపల్‌ నిర్వాకంపై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇక నిన్న ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. తాగిన మైకంలో ఓ టీచర్‌ విద్యార్థులతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ టీచర్‌ను పిల్లలు తరిమికొట్టారు. చెప్పులు విసురుతూ గేటు బయట వరకు తరిమేశారు. ఈ రెండు ఘటనలను గమనిస్తే ఛత్తీస్‌గఢ్‌లోనూ.. జీపీపల్లిలోనూ జరిగింది ఒకటే తరహా ఘోరం. రెండు చోట్లా తాగేసి టీచర్‌ స్కూల్‌కు రావడం.. పిల్లలను బుద్ధి చెప్పడం జరిగాయి.

ఇది కూడా చదవండి: వేసవిలో తప్పక తినాల్సిన కూరగాయలు ఇవే

 

#principal-of-the-government-school #banot-krishna #charla-mandal #gp-palli-village #bhadradri-kothagudem-district #viral-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి