YS Jagan : మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి రోజురోజుకు ఉచ్చు బిగుస్తోంది. చంద్రబాబు (CM Chandrababu) సర్కారు మరో శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమైయ్యారు. జగన్ లిక్కర్ స్కామ్ (Liquor Scam) పై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వాసుదేవరెడ్డి పాత్రపై సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
అవకతవకలు..
ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ (AP Beverages Corporation) ఎండీతో పాటు, డిస్టలరీల కమిషనర్‌గా వాసుదేవ రెడ్డికే జగన్ ప్రభుత్వం బాధ్యతలు కట్టబెట్టింది. జగన్ అండతో వాసుదేవ రెడ్డి పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని.. బినామీ పేర్లతో వాసుదేవ రెడ్డి డిస్టిలరీ వ్యాపారంలోకి చొరబడ్డారని జగన్ అనుచరులు 11 డిస్టలరీలను హస్తగతం చేసుకున్నారని తెలుస్తోంది.
జే గ్యాంగ్ హస్తగతం చేసుకున్న డిస్టలరీల నుంచే వాసుదేవరెడ్డి 65 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని.. కొన్ని ప్రీమియం బ్రాండ్‌ల తరహాలో పేర్లు పెట్టి జే బ్రాండ్‌ల మద్యం ఉత్పత్తి, విక్రయాలు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ సర్కారు జే బ్రాండ్ మద్యానికి అధిక ధరలు పెట్టి అమ్మారని.. ఒకే రకమైన బ్రాండ్‌ను తెలంగాణ కంటే అధిక ధర పెట్టి ఏపీలో కొనుగోలు చేసినట్టు విచారణలో వెల్లడి అయింది. అప్పుల కోసం భవిష్యత్తులో మద్యం నుంచి వచ్చే ఆదాయాన్ని జగన్ ప్రభుత్వం తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు సీఐడీ విచారణకు ఆదేశించారు.
Also Read : దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ గ్యారెంటీ స్కామ్.. మేఘా, పొంగులేటిపై సీబీఐ ఎంక్వయిరీ డిమాండ్!