Ponguleti Srinivasa Reddy: గతంలో మేఘా ఇంజనీరింగ్ కంపెనీ బ్యాంక్ గ్యారెంటీ మోసాలను RTV వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై సంచలన ఆరోపణలు చేశారు బీజేఎల్ఫీ నేత మహేశ్వర్ రెడ్డి. మేఘా సంస్థతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా నకిలీ గ్యారెంటీలతో అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. పొంగులేటి దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని ఏలేటి అన్నారు. కేవలం 8 కోట్లు మార్కెట్ క్యాప్ మాత్రమే ఉన్న యూరో యాక్సిన్ బ్యాంక్ నుంచి వందల కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారేజీలు ఎలా తీసుకున్నారు అని ఆయన ప్రశ్నించారు. మేఘా ఇంజనీరింగ్ కంపెనీతో పాటు మంత్రి పొంగులేటి కూడా ఇదేవిధమైన మోసానికి తెరలేపారు. అతి చిన్న బ్యాంక్ వందల కోట్ల గ్యారెంటీలను రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ వర్క్స్ కోసం ఉపయోగించడం పొంగులేటి చేసిన పెద్ద అవినీతి.. మోసం అంటూ మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. యూరో యాక్సిన్ బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చిన మేఘా, నవయుగ, రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీలపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ అవినీతిలో ప్రమేయం ఉన్న కంపెనీలన్నిటిపై సీబీఐతో విచారణ జరిపించాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. మహేశ్వర్ రెడ్డి RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కుంభకోణంపై ఏమన్నారో వివరంగా మీరు కూడా ఈ కింది వీడియో చూసి తెలుసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..Ponguleti Srinivasa Reddy: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ గ్యారెంటీ స్కామ్.. మేఘా, పొంగులేటిపై సీబీఐ ఎంక్వయిరీ డిమాండ్!
మేఘా ఇంజనీరింగ్ తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా బ్యాంక్ గ్యారెంటీల స్కామ్ లో ఉన్నారని బీజీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. దేశంలోనే అతిపెద్ద స్కామ్ కు పొంగులేటి పాల్పడ్డారని చెప్పారు. ఈ విషయంపై సీబీఐ ఎంక్వయిరీ జరిపించాలని డిమాండ్ చేశారు.
Translate this News: