Exercise: వ్యాయామం చేసేవారు కచ్చితంగా ఇది తెలుసుకోవాలి.. లేకపోతే ఆ ప్రాబ్లెమ్ తప్పదు!

వ్వాయామాన్ని కొత్తగా స్టార్ట్ చేసేవారు ముందుగా సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం. వ్యాయామం ఎంతవరకు చేయాలి.. ఎలాంటి వ్యాయామం చేయాలి అన్నది నిపుణుడు చెబుతాడు. దీని వల్లే అనవసర సమస్యలు రాకుండా ఉంటాయి.

Exercise: వ్యాయామం చేసేవారు కచ్చితంగా ఇది తెలుసుకోవాలి.. లేకపోతే ఆ ప్రాబ్లెమ్ తప్పదు!
New Update

Health tips: వ్యాయామం(Exercise) చాలా ముఖ్యం. ప్రస్తుత జీవనశైలి(Life Style)లో, ఉరుకులపరుగుల జీవితంలో చాలా మంది వ్యాయమానికి దూరంగా ఉంటున్నారు. టైమ్‌ కుదరడం లేదని ఎక్సర్‌సైజ్ చేయడంలేదు. ఇది అసలు కరెక్ట్ కాదు. టైమ్‌ సెట్‌ కాకపోతే టైమ్‌ సెట్ చేసుకోవాలి.. అంతేకానీ వ్యాయామం చేయడం అవ్వడంలేదని చెప్పకూడదు. హెల్త్ ఈజ్‌ వెల్త్.. ఈ విషయాన్ని అసలు మరువకూడదు. రోజుకు కనీసం 25-30 నిమిషాలైనా వ్యాయామం చేయాలి. ఇది మినిమం.. మ్యాక్సిమం కాదు. అయితే వ్యాయమం కూడా ఎలా పడితే అలా చేయవద్దు. ఇది మొదటికే మోసం వస్తుంది. సురక్షితంగా, సమర్థవంతంగా వ్యాయామం చేయడానికి ఈ విషయాలు తెలుసుకోండి.

ప్రొఫెషనల్‌ని సంప్రదించండి: ఇది చాలా మంది పాటించరు కానీ.. వ్యాయామం చేయడానికి ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. కొత్త వ్యాయామ దినచర్యను ప్రారంభించే ముందు, ఆరోగ్య సంరక్షణ నిపుణుడిని లేదా ఫిట్‌నెస్ నిపుణుడిని సంప్రదించండి. మీ ఆరోగ్య పరిస్థితుల గురించి వివరించండి. వారు చెప్పే సూచనను పాటించండి. వ్యాయామం ఎంతవరకు చేయాలి.. ఎలాంటి వ్యాయామం చేయాలి అన్నది నిపుణుడు చెబుతాడు.

publive-image ప్రతీకాత్మక చిత్రం

మీ ఫిట్‌నెస్ స్థాయికి తగిన వ్యాయామాలతో ప్రారంభించండి. గాయాలను నివారించడానికి క్రమంగా వ్యవధిని పెంచండి. అంటే ఒకే రోజు ఎక్కువగా శ్రమించవద్దు. స్లో స్లోగా టైమ్‌ను పెంచుకుంటూ పోవాలి.

వార్మ్ అప్: వ్యాయామం చేయడానికి ముందు కనీసం 5-10 నిమిషాలు వార్మ అప్ చేయండి. ఇద మస్ట్. లైట్ కార్డియో, డైనమిక్ స్ట్రెచ్‌లు చేయండి.

హైడ్రేటెడ్‌గా ఉండండి: వ్యాయామానికి ముందు, వ్యాయామం చేసే సమయంలో వాటర్‌ తాగండి. లేకపోతే డీహైడ్రేట్ అవుతాం. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలను తీసుకొస్తుంది.

ఏదైనా నొప్పి లేదా అసౌకర్యానికి గురైతే కాసేపు రిలెక్స్ అవ్వండి. నొప్పికి కారణం ఏంటో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. అసౌకర్యంగా ఉన్నప్పుడు వ్యాయామాన్ని కంటీన్యూ చేయడం ఏ మాత్రం మంచిది కాదు.

publive-image ప్రతీకాత్మక చిత్రం

విశ్రాంతి :తీవ్రమైన వ్యాయామాల మధ్య కోలుకోవడానికి మీ శరీర సమయాన్ని అనుమతించండి. విశ్రాంతి లేకపోవడం వల్ల సమస్యలు రావొచ్చు. ఓవర్‌ట్రైనింగ్ మంచిది కాదు. ఇది గాయాల ప్రమాదం పెంచుతుంది.

ఫిట్‌నెస్ అండ్‌ హెల్త్‌ కోసం కార్డియోవాస్కులర్ వ్యాయామాలపై దృష్టి పెట్టండి.

ఫిట్‌నెస్ లక్ష్యాలను ఏర్పరచుకోండి. ప్రతీరోజూ మీ టార్గెట్‌నుపెంచుకుంటూ వెళ్లండి. అయితే కంగారు వద్దు. గుర్తుంచుకోండి వ్యక్తిగత ఫిట్‌నెస్ అవసరాలు మారుతూ ఉంటాయి.

DISCLAIMER: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. RTV దీనిని ధృవీకరించలేదు.

Also Read: ఇదేందయ్య ఇది.. ఇలాంటి క్యాచ్ నేనెప్పుడూ చూడలా.. వైరల్‌ వీడియో!

WATCH:

#health-tips #excercise
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe