Smart Phones: స్మార్ట్‌ ఫోన్‌ కొనాలనుకుంటున్నారా..అయితే 10 వేల లోపు ఫోన్లు ఇవే..ఓ లుక్కేయండి!

పది వేల లోపు మొబైల్స్ కొనాలనుకునే వారికి కొన్ని ప్రముఖ కంపెనీలు తమ మొబైల్స్‌ ని తక్కువ ధరకే అందిస్తున్నట్లు ప్రకటించాయి. వీటిలో రెడ్‌ మీ, రియల్ మీ, మోటో .లావా కంపెనీలు ఉన్నాయి.

New Update
Smart Phones: స్మార్ట్‌ ఫోన్‌ కొనాలనుకుంటున్నారా..అయితే 10 వేల లోపు ఫోన్లు ఇవే..ఓ లుక్కేయండి!

కొత్తగా స్మార్ట్‌ ఫోన్‌ (Smartphone)  తీసుకోవాలి..అది కూడా మనకి తగిన బడ్జెట్‌ లో ఉండాలనుకునే వారికి కొన్ని ప్రముఖ కంపెనీలు కొన్ని మోడళ్లను అందుబాటులో ఉంచాయి. పది వేల లోపు మంచి ఫీచర్లతో ఉన్న స్మార్ట్‌ ఫోన్లను అమ్మకానికి సిద్దంగా ఉంచాయి. ఈ ఆఫర్లలో 5జీ ఫోన్లు కూడా ఉన్నాయి.

ప్రముఖ కంపెనీలు అయిన ఎంఐ, రియల్‌ మి, లావా, మోటో, ఐటెల్‌ తదితర కంపెనీలు తమ కంపెనీల ఫోన్లను ఆఫర్లో పెట్టాయి.

రెడ్‌ మీ 13సీ...ఈ ఫోన్‌ ని కంపెనీ 4 జీబీ ఫోన్‌ ను రూ.7,999 కే అందజేస్తుంది. ,6 జీబీ ఫోన్‌ అయితే రూ. 8,999 కి అందజేస్తున్నట్లు ప్రకటించింది. 50 ఎంపీ రియర్ , 5 ఎంసీ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుంది.

రెడ్‌ మీ 13 సీ (5జీ) ఫోన్ ను రూ.9,999 లకే 4జీబీ రామ్ తో అందిస్తుంది. దీని కెమెరా 50 ఎంపీ రియర్‌, 5 ఎంపీ సెల్ఫీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

రెడ్ మీ 12 (5జీ): ఇందులో 4 జీబీ ఫోన్‌ రూ. 8,999 లకే అందుబాటులో ఉంది. ఇందులో 50 ఎంపీ రియర్‌, 8 ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. దీని డిస్‌ప్లే 6.79అంగుళాలుగా ఉంటుంది.

రెడ్ మీ ఏఈ..ఇందులో 2 జీబీ మొబైల్స్ అయితే 5,999 , రూ.6,499 కే అందుబాటులో ఉండగా..4 జీబీ ఫోన్‌ రూ. 7,499 లకే అందిస్తున్నట్లు కంపెనీ వివరించింది. ఇందులో 8 ఎంపీ రియర్‌, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

రెడ్‌ మీ 12 సీ..మొబైల్ ని 4 జీబీ రామ్‌ తో రూ. 8,999 లకే అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనిలో 50 ఎంపీ రియర్‌, 5 ఎంపీ సెల్ఫీ సామర్ధ్యం కలిగిన కెమెరాని కలిగి ఉంది.

మోటో జీ 14..ఈ మొబైల్‌ ని 4 జీబీ రామ్‌తో రూ.9,999 లకే అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనిలో 50 మెగాపిక్సెల్ రియర్‌, 2 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాలను సామర్థ్యం కలిగి ఉంటుందని కంపెనీ వివరించింది.

లావా యువ 3 ప్రో..ఇది 8 జీబీ రామ్‌ కలిగిన ఫోన్‌ ని రూ. 8999 లకే అందజేస్తున్నట్లు తెలిపింది. ఇందులో 50 ఎంపీ రియర్‌, 8 ఎంపీ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది.

ఐటెల్‌ పీ 55 5 జీ మొబైల్‌ని రూ.9,999 లకే 8 జీబీ రామ్ తో కలిపి అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

లావా బ్లేజ్ 2 ప్రో..ఫోన్‌ ని 8 జీబీ రామ్‌ సామర్థ్యం కలిగిన ఫోన్‌ ని రూ.9,999 లకే అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

రియల్‌ మీ సీ 53..4 జీబీ మొబైల్‌ ని రూ.8999 కే అందజేస్తుంది.

రియల్ మి నార్జో ఎన్ 53..ఫోన్‌ 4 జీబీ రామ్‌ సామర్థ్యంతో రూ. 8,999 లకే అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

Also read: చికెన్‌ ప్రియులకు షాక్‌..భారీగా పెరిగిన ధరలు!

Advertisment
తాజా కథనాలు