Healthy Teeth Tips: ఇలా చేస్తే మౌత్‌వాష్‌లు అస్సలు అక్కర్లేదు

ప్రతిరోజూ అందరూ పళ్ళు తోముకుంటారు. కానీ కొంతమంది నోటిని శుభ్రం చేసుకోరు. దీంతో పలు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. మౌత్‌ వాష్‌లతో నోటిని శుభ్రంగా ఉంచుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దంత క్షయం, ఇన్ఫెక్షన్లు, చిగుళ్ల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Healthy Teeth Tips: ఇలా చేస్తే మౌత్‌వాష్‌లు అస్సలు అక్కర్లేదు
New Update

Best Practices for Healthy Teeth: నోటిని శుభ్రంగా ఉంచుకోకపోతే ఎన్నో రకాల ఆనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా దంతాల్లో నొప్పి, చిగుర్ల సమస్యలు ఎక్కువగా వస్తాయి. అంతేకాకుండా నోటి దుర్వాస‌న కూడా అధికంగా వస్తుంది. అందుకే రోజుకు రెండుసార్లు పళ్లు తోముకుంటే (Brushing Teeth) మంచిదని నిపుణులు అంటున్నారు. దీంతో పాటు మౌత్‌వాష్‌లను కూడా వాడుతూ ఉంటే ఇక మంచిదని అంటున్నారు. మార్కెట్‌లో రసాయ‌నాల‌తో చేసిన ఎన్నోరకాల మౌత్‌వాష్‌లు ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటికి బదులు ఇంట్లోనే స‌హ‌జ‌సిద్ధమైన ప‌దార్థాల‌తో మౌత్ వాష్‌ల‌ను త‌యారు చేసుకోని నోటిని శుభ్రం చేసుకోవచ్చ అంటున్నారు దంద వైద్యులు.

ప్రతిరోజు కొద్దిగా కొబ్బరినూనెనుతో

అయితే.. రోజు రోండు సార్లు నోటిని శుభ్రం చేసుకోటం వల్ల దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి స‌మ‌స్యలు కూడా రావంటున్నారు డాక్టర్లు. కొబ్బరి నూనె స‌హ‌జ‌సిద్ధమైన మౌత్ వాష్‌గా (Mouth Wash) బాగా ప‌నిచేస్తుంది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ ల‌క్షణాల వ‌ల్ల నోట్లో ఉండే సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియా న‌శించి నోటిని ఆరోగ్యంగా ఉంచి.. నోటి దుర్వాస‌న రాకూండా చేస్తుంది. ప్రతిరోజు కొద్దిగా కొబ్బరినూనెను నోట్లో పోసుకుని 15 నిమిషాల పాటు బాగా పుక్కిలించాలి. తర్వాత నీటితో నోటిని శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇలా రోజూ చేస్తే నోరు శుభ్రంగా ఉండడంతో పాటు దంతాలు, చిగుళ్ల స‌మ‌స్యలు ఉంటే తగ్గుతాయి.

నోరు శుభ్రంతో పాటు దుర్వాస‌న పొతుంది

గోరువెచ్చని అరగ్లాస్‌ నీటిలో కొద్దిగా ఉప్పు (Salt) కలిపి ఆ నీటిని నోట్లో పోసుకుని బాగా పుక్కిలించినా రోజంతా నోరు శుభ్రంగా ఉంటుంది. మార్కెట్‌లో దొరికే మౌత్‌వాష్‌ల కంటే కూడా ఉప్పు మంచిగా పనిచేస్తుంది. అంతేకాకుండా అరక‌ప్పు నీటిలో అంతే మోతాదులో క‌ల‌బంద ర‌సం క‌లిపి ఆ మిశ్రమంతో పుక్కిలించాలి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల చిగుళ్ల సమస్యలు ఉంటే త్వరగా పోతాయి. దంతాల మధ్య ఉంటే పాచికూడా పోయి.. నోరు శుభ్రం అవడంతో పాటు దుర్వాస‌న త‌గ్గుతుంది. క‌ప్పు నీటిలో 10 చుక్కల దాల్చిన చెక్క నూనె, 10 చుక్కల లవంగాల నూనె క‌లిపి మిశ్రమాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించాలి. దీని వ‌ల్ల నోటి దుర్వాస‌న త‌గ్గి.. దంత క్షయం కూడా తగ్గుతుంది. దీన్ని ఎక్కువ తయారు చేసుకుని సీసాలో నిల్వకూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఉదయం పూట వేప పుల్లతో పళ్ళు తోముకున్నా నోరు శుభ్రంగా ఉండడంతోపాటు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. చూశారుగా ఇలాంటి ఈ చిట్కాలతో నోటిని శుభ్రంగా ఉంచుకొని సమస్యలు దూరం చేసుకోండి. ఈ సమాచారం తాత్కాలికంగా ఇవ్వబడినది. మరిన్ని దంత సమస్యలు ఉన్నా.. చిగుళ్ల సమస్యలు ఉన్న వెంటనే దంద వైద్యులను సంప్రదించి మంచి సలహాలు పాటిస్తే ఆరోగ్యానికి మంచిది.

ఇది కూడా చదవండి: ఈ చిట్కాలు పాటించి చూడండి.. తల్లిపాలు బాగా ఉత్పత్తి అవుతాయి..!

#healthy-teeth #teeth-care-tips
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe