Best Investment Scheme For Women : పొదుపు చేసుకోవాలి.. తర్వాత పెట్టుబడి పెట్టాలి.. కొన్నాళ్లకు రాబడి వస్తుంది. చాలా మందికి ఇన్‌వెస్ట్ చేయడంపై అవగాహన ఉండదు. ఎక్కడ ఇన్‌వెస్ట్(Investment) చేయాలి.. ఎందులో పెట్టుబడి పెట్టాలి లాంటిపై ఫోకస్ ఉండదు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో పొదుపు డబ్బును బ్యాంకులో ఉంచడం అంత బెస్ట్ కాదన్నది మార్కెట్ నిపుణుల మాట. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మీ పొదుపు విలువను క్రమంగా తగ్గిస్తుంది. అందుకే స్కీమ్‌ల్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమంగా నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా మహిళలు మంచి పథకంలో పెట్టుబడి పెట్టాలి. గృహిణుల కోసం కొన్ని గొప్ప పథకాల గురించి తెలుసుకోండి.
మహిళల కోసమే ఈ పథకం:
మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన(Mahila Samman Bachat Patra Yojana) గురించి తెలుసా? ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ పొదుపుపై అద్భుతమైన రాబడిని పొందవచ్చు. మహిళల కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. మహిళలు(Women's) మాత్రమే ఈ పథకంలో పెట్టుబడి పెట్టగలరు. ప్రస్తుతం ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు 7.5 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం(Mahila Samman Savings Certificate Scheme) లో మహిళలు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పెట్టుబడి పెట్టగలరు. ఈ పోస్టాఫీసు పథకం(Post Office Scheme) లో మీరు కనీసం రూ. 1,000.. గరిష్టంగా రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
మ్యూచువల్ ఫండ్‌లో పెట్టవచ్చా?
మ్యూచువల్ ఫండ్(Mutual Fund) పెట్టుబడులు మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటుంది. అందులో పెట్టుబడి పెట్టిన డబ్బు మార్కెట్‌ని బట్టి నిర్ణయిస్తారు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి లాంగ్ టర్మ్ ఇన్‌వెస్ట్‌మెంట్‌కి మంచి ఎంపికగా నిపుణులు చెబుతుంటారు. మహిళలు తమ పొదుపును SIP చేయడం ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా.. మహిళలు లాంగ్‌టర్మ్‌లో మంచి మొత్తంలో డబ్బులను పొందవచ్చు.
Also Read : అరే ఏంట్రా ఇదీ.. మళ్ళీనా! డ్రగ్స్ కేసులో షణ్ముఖ్ అరెస్ట్!