Bengaluru: మాల్స్ లోనే టాయిలెట్ వెళ్లండి.. ఒత్తిడి చేస్తున్న ఓనర్స్!

కర్ణాటక రాష్ట్రం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. కరువుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్ మెంట్స్ లో వింత రూల్స్ పెట్టారు. మాల్స్ లోనే టాయిలెట్ వెళ్లండి. స్నానం చేయొద్దు. పేపర్ ప్లేట్లు వాడండి అంటూ సూచించే పోస్టులు వైరల్ అవుతున్నాయి.

New Update
Bengaluru: మాల్స్ లోనే టాయిలెట్ వెళ్లండి.. ఒత్తిడి చేస్తున్న ఓనర్స్!

Water crisis: బెంగళూరు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. వేసవి పూర్తిగా రాకముందే కర్ణాటక నీటి కరువుతో సతమతమవుతోంది. ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మాల్స్‌లో టాయిలెట్లను ఉపయోగించమని అపార్ట్ మెంట్, ఇంటి ఓనర్స్ బలవంతం చేస్తున్నారంటూ నివాసితులు తమ పరిస్థితులను సోషల్ మీడియా వేదికగా వెల్లగక్కుతున్నారు. రాజధానిలో ఉండే జనాలంతా నిరాశ, భయం, ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు.

236 తాలూకాల్లో 223 గ్రామాల్లో కరువు..
ఈ మేరకు సకాలంలో వర్షాలు కురవకపోవడంతో సాగు, తాగు నీటికి కర్ణాటకలో కరువు ఏర్పడింది. నీళ్లు దొరకపోవడంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగు నీటి కోసం ప్రజలు బిందెలతో వాటర్ ట్యాంకర్ల ముందు బారులు తీరుతున్నారు. మార్చి మొదటి వారంలోనే పరిస్థితి ఇలావుంటే మున్ముందు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మొత్తం 236 తాలూకాల్లో 223 గ్రామాలు కరువు బారిన పడ్డాయి. 219 తాలుకాల్లోనూ కరువు ప్రభావం చాలా ఎక్కువగా ఉందని సర్కారు గణాంకాలు తెలిపాయి. దీంతో చాలా మంది అద్దెదారులు ఖాళీ చేయగా.. మరికొందరు తాత్కాలిక వసతి గృహాల్లో చేరుతున్నారు.

ఇది కూడా చదవండి : Vishaka: ప్రేమ జంట ఘరానా మోసం.. ఖాకీ వేషంలో కోట్లు కొల్లగొట్టారు!

నీటి సరఫరా చేస్తాం..
రాష్ట్రంలోని 136 తాలూకాల్లో 123 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించామని,109 తాలూకాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. కర్నాటక ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ మార్చి 5న బెంగుళూరుకు తగిన నీటి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. బెంగుళూరు ఈ భయంకరమైన సవాలును ఎదుర్కొంటున్నందున, నిపుణులతో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

అసోసియేషన్లు రూల్స్ స్ట్రిక్ట్..
మరోవైపు.. గేటెడ్ కమ్యూనిటీలు, అనేక అపార్ట్ మెంట్లలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు రూల్స్ స్ట్రిక్ట్ చేశాయి. కార్లు కడగొద్దు.. నీటి అనవసర వినియోగం ఆపండి.. వీలైతే స్నానం చేయొద్దు.. కుదిరితే తడి గుడ్డతోనే ఒళ్లు తుడుచుకోండి.. అంటూ సిటీలోని కనకపుర రోడ్డులోని ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీ అపార్ట్ మెంట్ల సంఘం పిలుపునివ్వడం విశేషం. అంతేకాదు భోజనం చేసేందుకు పేపర్ ప్లేట్లు మాత్రమే వాడాలని, చెంచాలు, గ్లాసుల వంటివి డిస్పోజబుల్ వి మాత్రమే వినియోగించాలని సూచిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్స్ ను అయితే ఎట్టి పరిస్థితిలోనూ నీటితో నింపొద్దని నిర్ణయం తీసుకున్నారు. వైట్ ఫీల్డ్ ఏరియాలోని ఓ అసోసియేషన్ నీటి వినియోగాన్ని కట్టడి చేసేందుకు సెక్యూరిటీగార్డుల ద్వారా మానిటర్ చేస్తుండటం విశేషం.

#water-crisis #bengaluru #karnataka
Advertisment
తాజా కథనాలు