Rameshwaram Cafe blast: బెంగళూరు కేఫ్‌ పేలుడు కేసు.. నిందితులు ఒక్కొక్కరిపై రూ.10 లక్షల రివార్డు!

బెంగళూరు రామేశ్వరం కేఫ్‌ పేలుళ్ల కేసులో ఇద్దరు కీలక నిందితుల అరెస్టుకు NIA ప్రయత్నిస్తోంది. ఈ నిందితుల ఆచూకీ తెలిపిన వారికి ఒక్కొక్కరిపై రూ.10 లక్షల రివార్డును ఎన్‌ఐఏ ప్రకటించింది. మార్చి 1న బెంగళూరు బ్రూక్‌ఫీల్డ్‌లోని ITPL రోడ్‌లో ఉన్న కేఫ్‌లో IED పేలుడు సంభవించింది.

New Update
Rameshwaram Cafe blast: బెంగళూరు కేఫ్‌ పేలుడు కేసు.. నిందితులు ఒక్కొక్కరిపై రూ.10 లక్షల రివార్డు!

Rameshwaram Cafe Blast Accused: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు కేసులో ఇద్దరు వాంటెడ్ నిందితులు అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా, ముసావిర్ హుస్సేన్ షాజీబ్‌ కోసం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గాలింపును కొనసాగిస్తోంది. ఈ ఇద్దరి ఆచుకీ తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది. మరోవైపు దర్యాప్తు సంస్థ ప్రధాన కుట్రదారుని అరెస్టు చేసింది. మూడు రాష్ట్రాల్లోని 18 చోట్ల సోదాలు చేసిన ఎన్‌ఐఏ ముజమ్మిల్ షరీఫ్‌ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే!


మార్చి 1న బెంగళూరు బ్రూక్‌ఫీల్డ్‌లోని ITPL రోడ్‌లో ఉన్న కేఫ్‌లో IED పేలుడు సంభవించింది. ఈ కేసులో ఇద్దరు వాంటెడ్ నిందితులకు ముజమ్మిల్ షరీఫ్ లాజిస్టిక్ మద్దతును అందించినట్లు NIA దర్యాప్తులో తేలింది.


అసలేం జరిగింది?
ఈ పేలుడు ఘటనకు సంబంధించి బెంగళూరులోని హెచ్‌ఏఎల్ పోలీస్ స్టేషన్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాల(UAPA) చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదైంది. మొదట బాంబు ఉన్న బ్యాగ్‌తో రామేశ్వరం హోటల్‌కు వచ్చిన ఓ వ్యక్తి టోకెన్‌ కొనుగోలు చేశాడు. కౌంటర్‌లో సెమోలినా ఇడ్లీ తీసుకున్నాడు. ఆ తర్వాత బాంబ్ ఉన్న బ్యాగ్‌ని హోటల్ వాష్ బేసిన్‌ వద్ద వదిలేశాడు. ఈ ఘటనలో మొత్తం 9మంది గాయపడ్డారు. పేలుడు జరిగిన వెంటనే భయంతో.. హోటల్‌ సిబ్బంది, కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. అక్కడికి చేరుకున్న బాంబు స్క్వాడ్‌, క్లూస్ టీం అధికారులు ఆ పేలుడుకు సంబంధించి ఆధారాలను సేకరించారు. ఈ ఘటన మార్చి 1న జరిగింది.

Also Read: మహిళా క్రికెటర్‌పై బీజేపీ ఆగ్రహం.. మోదీ, అమిత్‌షాను ట్రోల్‌ చేస్తూ పూజా పోస్ట్‌ వైరల్!

Advertisment
తాజా కథనాలు