Metro: మెట్రో స్టేషన్ లో బహిరంగ హస్తప్రయోగం.. సిబ్బందిపై మహిళల ఫిర్యాదు!

బెంగళూరులో మరో షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. మహిళా ప్రయాణికురాలితో మెట్రో ఉద్యోగి అనుచితంగా ప్రవర్తించాడు. ఫ్లామ్ ఫామ్ పై నిలబడి ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ బహిరంగంగా హస్త ప్రయోగం చేశాడు. దీన్ని వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

New Update
Metro: మెట్రో స్టేషన్ లో బహిరంగ హస్తప్రయోగం.. సిబ్బందిపై మహిళల ఫిర్యాదు!

Bengaluru: బెంగళూరులో మరో షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. మెట్రో స్టేషన్‌లో భద్రతా సిబ్బంది అనుచిత ప్రవర్తనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. జాలహళ్లి మెట్రో స్టేషన్‌లోనే బహిరంగంగా హస్తప్రయోగం చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

అసభ్యకరమైన సంజ్ఞలు..
ఈ మేరకు ఒక మహిళా ప్రయాణికురాలు ఇందుకు సంబంధించిన వీడియోను నెట్టింట షేర్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేసింది. ఆమె చిత్రీకరించిన వీడియోలో.. భద్రతా సిబ్బంది తమను అనుచితంగా తాకడం, అసభ్యకరమైన సంజ్ఞలు చేయడం కనిపించింది. 'ఒక సెక్యూరిటీ గార్డు ప్లాట్‌ఫారమ్‌ ఎదురుగా నిలబడి తన ప్రైవేట్ భాగాలపై చేతులు వేసి కొన్ని అసభ్య సంజ్ఞలు చేశాడు. నా వైపు నిరంతరం చూస్తూనే పిచ్చిగా వ్యవహరించాడు. సరిగ్గా మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఇది జరిగింది' అని చెప్పింది.

ఇది కూడా చదవండి: Viral: అపార్ట్ మెంట్ లో ఓపెన్ శృంగారం.. కిటికీలు, తలుపులు తెరిచి దారుణం!

మెట్రో అధికారులు స్పందించలేదు..
అయితే ఈ వీడియోను బెంగళూరు మెట్రో అధికారులకు ఫార్వార్డ్ చేసిన తన ఫిర్యాదులను పరిష్కరించలేదని ఆరోపిస్తూ ఆ మహిళ నిరాశను వ్యక్తం చేసింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆందోళన కలిగించే సంఘటనపై సోషల్ మీడియా యూజర్స్ మండిపడుతున్నారు. ప్రజా రవాణాను ఉపయోగించే ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి త్వరిత చర్య తీసుకోవాలని చాలా మంది పిలుపునిచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు