Bizarre: ఓరి మీ దుంపతెగ.. బస్ షెల్టర్‌ను కూడా ఎత్తుకెళ్లిపోయారుగా.. ఎక్కడంటే..

మునుపు ఎవరూ చేయని విధంగా చోరీ చేసి.. యావత్ దేశాన్నే తమవైపు తిప్పుకున్నారు. అవును, కర్నాటక రాజధాని బెంగళూరు(Bengaluru)లో విచిత్ర ఘటన వెలుగు చూసింది. ఈ దొంగలు విచిత్రమైన చోరీ చేశారు. ప్రజల ఇళ్లలో పడితే పట్టుకుంటున్నారని అనుకున్నారో ఏమో గానీ.. పబ్లిక్ ప్లేసులోనే దర్జాగా చోరీ చేసుకెళ్లారు. బెంగళూరులోని కన్నింగ్‌హామ్ రోడ్‌లో ఏర్పాటు చేసిన రూ. 10 లక్షల విలువైన స్టెయిన్ లెస్ స్టీల్ బస్ షెల్టర్‌ను మాయం చేశారు చోర కళా వల్లభులు.

New Update
Bizarre: ఓరి మీ దుంపతెగ.. బస్ షెల్టర్‌ను కూడా ఎత్తుకెళ్లిపోయారుగా.. ఎక్కడంటే..

Bengaluru bus stand Theft: దొంగలు.. ఇళ్లలో పడి నగదు, ఆభరణాలను దోచుకెళ్లడం(Robbery) చూశాం.. రోడ్డు వెంట వెళ్తుంటే చైనా స్నాచింగ్‌కు పాల్పడటం చూశాం.. బంగారు దుకాణంలో దోపిడీ చూశాం.. బ్యాంకులను కొల్లగొట్టిన తీరునూ చూశాం.. కానీ, ఈ దొంగలు మాత్రం మహా కంచుల్లా ఉన్నారండోయ్. మునుపు ఎవరూ చేయని విధంగా చోరీ చేసి.. యావత్ దేశాన్నే తమవైపు తిప్పుకున్నారు. అవును, కర్నాటక రాజధాని బెంగళూరు(Bengaluru)లో విచిత్ర ఘటన వెలుగు చూసింది. ఈ దొంగలు విచిత్రమైన చోరీ చేశారు. ప్రజల ఇళ్లలో పడితే పట్టుకుంటున్నారని అనుకున్నారో ఏమో గానీ.. పబ్లిక్ ప్లేసులోనే దర్జాగా చోరీ చేసుకెళ్లారు. బెంగళూరులోని కన్నింగ్‌హామ్ రోడ్‌లో ఏర్పాటు చేసిన రూ. 10 లక్షల విలువైన స్టెయిన్ లెస్ స్టీల్ బస్ షెల్టర్‌ను మాయం చేశారు చోర కళా వల్లభులు. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ ఘటన నెల రోజుల క్రితం జరిగితే.. బిల్డర్ ఇప్పుడు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. మరి ఈ నెల రోజుల గ్యాప్ ఎందుకు తీసుకున్నారనేది కూడా ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బిఎమ్‌టిసి) బస్ షెల్టర్‌ల నిర్మాణానికి బాధ్యత వహించే ఒక కంపెనీ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ రవిరెడ్డి సెప్టెంబర్ 30న బస్ షెల్టర్ మిస్సింగ్‌పై కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. అయితే, ఈ ఘటన ఆగష్టు 28న జరిగతే.. ఇప్పుడు ఫిర్యాదుచేశాడు. అయితే, ఈ బస్ షెల్టర్ నిర్మాణం ఆగష్టు 21న పూర్తయ్యింది. కొద్ది రోజుల్లోనే కేటుగాళ్లు ఈ షెల్టర్‌ను మాయం చేశారు. చోరీకి గురైన బస్ షెల్టర్ పోలీస్ కమీషనర్ కార్యాలయానికి చాలా సమీపంలోనే ఉంది. అంతేకాదు.. విధాన సౌధ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంది. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.

అయితే, ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చుట్టుపక్కన ఉన్నవారి స్టేట్‌మెంట్స్ తీసుకుంటున్నారు. నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా, బెంగళూరులో ఇలాంటివి జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో, మార్చి నెలలో HRBR లేఅవుట్ వద్ద మూడు దశాబ్దాల నాటి బస్టాప్ రాత్రికి రాత్రే అదృశ్యమైంది. 2015లో హారిజన్ స్కూల్ సమీపంలోని దూపనహళ్లి బస్ స్టాప్ రాత్రికి రాత్రే కనుమరుగైంది. 2014లో బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్‌లోని బీఈఎంఎల్ లేఅవుట్ III స్టేజ్‌లో 20 ఏళ్ల నాటి బస్టాప్ కూడా అదృశ్యమైంది.

Also Read:

TSRTC Special Buses : దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త

రవితేజకు సారీ చెప్పిన బాలీవుడ్ నటుడు.. అసలు ఏం అయిదంటే..?

Advertisment
తాజా కథనాలు