Bengal: మోడీజీ.. హోదాకు తగ్గట్లు నడుచుకోండి: ప్రధానిపై మమత విమర్శలు!

ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహారశైలిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఆయన బెదిరింపులకు తాము భయపడమంటూ హెచ్చరించారు.

New Update
Bengal: మోడీజీ.. హోదాకు తగ్గట్లు నడుచుకోండి: ప్రధానిపై మమత విమర్శలు!

Mamatha: ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహారశైలిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. దేశాన్ని జైలులా మార్చారని మండిపడ్డారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మమత మాట్లాడుతూ.. ప్రధాని హోదాను గౌరవిస్తాను.. కానీ ఆయన మాటలను సమర్ధించనని తేల్చి చెప్పారు.

హెచ్చరికలు చేయడం సబబేనా..
ఈ మేరకు 'జూన్ 4 తర్వాత అందరినీ ఒక్కొక్కరిగా జైల్లో పెట్టిస్తా’ అంటూ మోడీ చేసిన కామెంట్స్ ను ఆమె తప్పుబట్టారు. ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నేతలకు హెచ్చరికలు చేయడం సబబేనా అని ఆమె ప్రశ్నించారు. దేశాన్ని జైలులా మార్చాలనే దురుద్దేశం ఉందని ప్రధాని మాటలతో అర్థమవుతోందిని చెప్పారు. 'మోడీజీ.. మీకు ఒక జేబులో ఈడీ, సీబీఐ, మరో జేబులో ఎన్‌ఐఏ, ఐటీ విభాగాలున్నాయి. మీ పార్టీకి నిధులు రావడానికి ఈ దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారు. వాటి ద్వారా ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారు. ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి బెదిరింపులకు పాల్పడకూడదు. వాటికి మేం భయపడం’ అంటూ తనదైన స్టైల్ లో వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Ugadi: ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన సీఎం రేవంత్!

ఆప్ మరింత మెజారిటీతో గెలుస్తుంది..
అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించిన ఆమె.. జైలులో ఉన్నప్పటికీ ఆయన పాలనా వ్యవహారాలను నిర్వహిస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. ఈ పరిణామం కేజ్రీవాల్‌ విజయావకాశాలను ఏ మాత్రం ప్రభావితం చేయదని, ఆప్ మరింత మెజారిటీతో ఢిల్లీలో గెలుస్తుందని చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు