Tennis Benefits : మనం టెన్నిస్(Tennis) అనేది కేవలం ఒక క్రీడగానే చూస్తాం. కానీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. టెన్నిస్ ఆడుతున్నప్పుడు మన తల నుంచి కాలి వరకు అన్ని కండరాలు, నరాలు పునరుజ్జీవింపబడతాయి. శరీర శక్తిని పెంచుతుంది. రోజంతా చురుకుగా పని చేయవచ్చు. అంతే కాదు శరీర పనితీరులో అనేక మార్పులు తెచ్చి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒక గంట టెన్నిస్ ఆడితే అరగంట శక్తివంతమైన ఏరోబిక్ వ్యాయామాలు(Aerobic Exercises) చేయడంతో సమానమని నిపుణులు అంటున్నారు. ఇది గుండె పనితీరును క్రమంగా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.
కండరాలకు బలం:
- మన శరీర బరువును సరిగ్గా నిర్వహించడానికి టెన్నిస్ సహాయపడుతుంది. కండరాలు, ఎముకలు దృఢంగా మారుతాయి.
బరువు తగ్గడానికి టెన్నిస్:
- టెన్నిస్ ఆడటం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు(Fat Burn) చాలా త్వరగా కరిగిపోతుంది. ఒక గంట టెన్నిస్ 500 కేలరీలకు పైగా బర్న్ చేయగలదు.
ఒత్తిడిని తగ్గిస్తుంది:
- టెన్నిస్ అనేది ఒత్తిడిని తగ్గించడానికి, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఒక అద్భుతమైన వ్యాయామం. శారీరక శ్రమ, ఇతరులతో కలిసి ఆడటం వల్ల ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించవచ్చు. అంతేకాకుండా రోజూ టెన్నిస్ ఆడటం వలన నిద్రలేమిని నయం చేయవచ్చు. అలాగే శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా ఉంచుతుంది.
దీర్ఘకాలిక వ్యాధులు:
- శరీరంలో దీర్ఘకాలిక మంటలు, దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కలిగే నొప్పిని తగ్గించడంలో టెన్నిస్ చాలా సహాయపడుతుంది. టెన్నిస్ ఆడటం వల్ల కండరాల కదలిక మెరుగుపడుతుంది. మంటలు తగ్గుతాయి.
మెదడు ఆరోగ్యం:
- టెన్నిస్ ఆడుతున్నప్పుడు మెదడులోని నాడీ కణాలు ఉత్తేజితం అవుతాయి. మెదడు పనితీరు, సామర్థ్యం మెరుగుపడతాయి. ఇది రోజంతా శరీరం మరియు మనస్సును చురుకుగా ఉంచుతుంది.
ఇది కూడా చదవండి: భోజనం చేయగానే నారింజ తింటే కడుపుకు చాలా ప్రమాదం
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.