Holi: హోలికా దహనం బూడిద మీ ఇంట్లో ఉందా.. అయితే అదృష్టవంతులే!

హోలికా దహనం బూడిదకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ బూడిద ఇంట్లో ఉంటే అష్ట ఐశ్వర్యాలు సమకూరుతాయట. రాహు, కేతు ప్రభావాలు తగ్గిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. పూర్తి సమాచారం కోసం హెడ్డింగ్ క్లిక్ చేయండి.

New Update
Holi: హోలికా దహనం బూడిద మీ ఇంట్లో ఉందా.. అయితే అదృష్టవంతులే!

Holika dahan 2024: హోలీ పండుగకు ఒక రోజు ముందు హోలికా దహనం జరపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దీనిని ప్రతీకగా భావిస్తారు. అయితే హోలికా దహనంలో ఆవు పేడతో చేసిన పిడకలు, ఇంట్లో పాత వస్తువులతోపాటు ఎండిన కొమ్మలు వంటివి వేసి మంటలు వెలిగిస్తారనే విషయం తెలిసిందే. కాగా వీటి బూడిదకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ బూడిద ఇంట్లో ఉంటే అష్ట ఐశ్వర్యాలు సమకూరుతాయని బలమైన నమ్మకం.

రాహు, కేతు ప్రభావాలు తగ్గిపోతాయి..
ఇక హోలికా దహనం కోసం చెకుముకిరాయితో మంటలను వెలిగిస్తారు. దహనం తర్వాత జీవితంలో భయాలు, కష్టాలు, దుఃఖాలు తొలగిపోవాలని కోరుకుంటూ వేడి బొగ్గులపై నడుస్తారు. ఇదే క్రమంలో తమ దురదృష్టాలను పారద్రోలేందుకు హోలికా దహనం నుంచి వచ్చిన బూడిదను ఇంటికి తెచ్చుకుంటారు. హోలికా దహనం బూడిదతో కొంతమంది స్నానం చేస్తే.. మరి కొందరు ఇంట్లో చల్లుకుంటారు. అయితే ఇంట్లో ఈ బూడిద చల్లడం వల్ల బ్యాక్టీరియా నశించిపోతుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ భస్మాన్ని శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా జాతకంలో రాహు, కేతు ప్రభావాలు తగ్గిపోతాయని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: TS: బీఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌.. మాజీ ఎమ్మెల్సీ గుడ్ బై!

వైద్య గుణాలుంటాయని బలమైన విశ్వాసం..
ఇక ఈ బూడిదలో శక్తివంతమైన వైద్య గుణాలుంటాయని బలమైన విశ్వాసం. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఒక నెలపాటు ఈ బూడిదను బొట్టు పెట్టుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్ముతారు. ఇక ఈ బూడిదను ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి ఒక నాణెం అందులో పెట్టి మూట కట్టి లాకర్లో ఉంచుతారు. ఇలా చేస్తే ఆదాయ వనరులు సమకూరుతాయని నమ్ముతారు. వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు. ఇంట్లో శాంతి నెలకొంటుంది. కుటుంబాల్లో గొడవల తగ్గిపోయి ప్రేమను పంచుకునేలా ప్రేరేపిస్తుందని నమ్ముతారు. ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గిపోతుందని పండితులు సూచిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు