Porridge Health Benefits: గంజి తాగడం వల్ల లాభాలు తెలిస్తే అస్సలు వదలరు పాతకాలంలో మన పెద్దలు ఎక్కువగా గంజినే ఆహారంగా తీసుకునేవారు. ఎదిగే పిల్లలకు గంజితో అన్నం పెడితే వారికి కావాల్సిన పోషకాలు అందుతాయి. గంజి మన జీర్ణ వ్యవస్థను బాగా మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. By Vijaya Nimma 04 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Porridge Health Benefits: ప్రస్తుత కాలంలో అన్నం వండేటప్పుడు మనం గంజిని వృధాగా పారబోస్తుంటాం. పాతకాలంలో మన పెద్దలు ఎక్కువగా గంజినే ఆహారంగా తీసుకునేవారు. గంజిని కాస్త అన్నంలో కలిపి తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అందుకే పొద్దున లేవగానే గంజిని తాగి ఏదైనా పనులకు వెళ్లేవాళ్ళు. వేసవి కాలంలో గంజిని తాగడం వల్ల శరీరానికి చలవ చేస్తుంది. అంతేకాకుండా మన ఎముకలు కూడా దృఢంగా మారుతాయి. ఎదిగే పిల్లలకు గంజితో అన్నం పెడితే వారికి కావాల్సిన పోషకాలు అందుతాయి. గంజి మన జీర్ణ వ్యవస్థను బాగా మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది కూడా చదవండి: దంపతుల మధ్య గొడవలకు ప్రధాన కారణాలు ఇవే ఈ గంజిలో ఉండే బాక్టీరియా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదయాన్నే గంజితో చేసిన అన్నం తింటే రోజంతా ఆరోగ్యంగా ఉండవచ్చు. గంజి అన్నానికి కావలసిన పదార్థాలు.. నానబెట్టిన బియ్యం కప్పు తీసుకోవాలి. మజ్జిగ రెండు కప్పులు తీసుకోవాలి, రాళ్ల ఉప్పు, పొడుగ్గా తిరిగిన మిరపకాయలు, పెద్దగా కోసుకున్న ఉల్లిపాయ, అలాగే నాలుగు కప్పుల నీళ్లు తీసుకోవాలి. గంజి అన్నం తయారీ కోసం ముందుగా ఒక గిన్నెలో బియ్యం తీసుకొని నాలుగు కప్పుల నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత గంజిని వార్చి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత అన్నాన్ని మట్టి కుండలో తీసుకొని చల్లబడిన తర్వాత రెండు గ్లాసుల నీళ్లతో పాటు గంజి, మజ్జిగ పోసి రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత దానిపై మిర్చి, ఉల్లి ముక్కలు వేసుకుని రాత్రంతా పులియబెట్టాలి. బరువు తగ్గాలని అనుకునేవారు గంజి బెస్ట్ దీన్ని ఉదయాన్నే అల్పాహారంగా పచ్చిమిర్చితో పాటు ఉల్లి నంచుకుంటూ తింటే రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. గంజిలో విటమిన్ బి, సి, ఇతోపాటు మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అతిసారం, కడుపునొప్పిని ఇది తగ్గిస్తుంది. గంజి మనలోని ఎలక్ట్రోలైట్స్‌ను బ్యాలెన్స్‌గా ఉంచుతుంది. డీహైడ్రేషన్, అలసటను కూడా బాగా తగ్గిస్తుంది. దీనిలో ఉండే ఐరన్, జింక్తో పాటు మెగ్నీషియం ఇన్ఫెక్షన్ల బారి నుంచి మనల్ని రక్షిస్తాయి. మహిళలకు నెలసరి నొప్పులను తగ్గించడంలో కూడా గంజి బాగా పనిచేస్తుంది. బరువు తగ్గాలని అనుకునేవారు గంజి తాగడం వల్ల ఎక్కువ సమయం ఆకలి అవకుండా ఉంటుంది. చిన్నారులు పాలు సరిగా తాగకపోతే కనీసం గంజి నీళ్లు అయినా తాగించడం వల్ల విటమిన్స్, మినరల్స్ తిరిగి వారు పొందుతారు. అలాగే విరేచనాలు అయినప్పుడు గంజి నీటిని తాగితే తగ్గిపోతాయి. #health-benefits #porridge మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి