Coconut Water : కొబ్బరి నీళ్ళలో(Coconut Water) సోడియం, పొటాషియం, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్స్, అమైనో యాసిడ్స్, సైటోకిన్స్, వంటి ఎలక్ట్రోలైట్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలోని తక్కువ కెలారీలు, కార్బ్స్, మధుమేహం , గుండె, అధిక బరువు(Over Weight) సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే కొబ్బరి నీళ్లలో సబ్జా గింజలు(Sabja Seeds) వేసి తాగితే ఆరోగ్యానికి, శరీరానికి మరింత మంచిదని నిపుణులు చెపుతున్నారు.
Also Read : Banana Cup Cake: టేస్టీ, యమ్మీ బనాన కప్ కేక్ .. ఇంత ఈజీనా..! ట్రై చేయండి
కొబ్బరి నీళ్ళలో సబ్జా గింజలు వేస్తే కలిగే లాభాలు
- సబ్జా గింజల్లో శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఉంటాయి. వీటిని కొబ్బరి నీళ్లతో కలిపి తాగితే శరీరానికి కావల్సినంత ఎలక్రోలైట్స్(Electrolytes) అందించడంతో పాటు సహజంగా శరీరంలోని అధిక ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది. అలాగే తరుచూ డీ హైడ్రేషన్ సమస్యతో బాధపడేవారికి ఇవి అద్భుతంగా పని చేస్తాయి.
- సాధారణంగా కొబ్బరి నీళ్లలో చక్కెర వేసి తాగే వారికి సబ్జా సీడ్స్ సరైన ప్రత్యామ్నాయం. వీటిలోని అధిక ఫైబర్,తక్కువ కేలరీలు ఇతర పోషకాలు అసిడిటీ, గ్యాస్ కడుపుబ్బరం వంటి జీర్ణక్రియ సమస్యలు, రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. కానీ సబ్జా గింజలు అతిగా తింటే డయేరియా, కడుపులో నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇంకా కొబ్బరి నీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో విషపూరితాలను తొలగిస్తాయి.
కొబ్బరి నీళ్లు, సబ్జా గింజల నీటిని తయారు చేసే విధానం
గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ సబ్జా గింజలు వేసి పదిహేను నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన నీటిని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా తాగొచ్చు. ముఖ్యంగా వేసవిలో ఈ నీళ్ళు తాగితే శరీరం పై మంచి ప్రభావం ఉంటుంది. అయితే ఈ నీటిని తాగినా మోతాదులో మాత్రమే తీసుకోవాలి అతిగ్ తాగితే ఆరోగ్యానికి ప్రమాదం అని నిపుణుల సూచన.
Also Read : Curd: భారతీయ భోజనంలో.. పెరుగు ఎందుకు ఉంటుందో తెలుసా..?