చలికాలంలో క్యారెట్‌ జ్యూస్‌ తాగడం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా!

శీతాకాలంలో క్యారెట్లను తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. క్యారెట్లను తీసుకోవడం వల్ల కంటి జబ్బులతో పాటు, గుండె సంబంధిత వ్యాధులను కూడా దూరం చేస్తుంది.

Health Tips : బీపీ అదుపులో ఉండాలంటే.. ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగండి..!
New Update

శీతాకాలం మొదలైంది అంటే చాలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. వాటన్నింటికీ చెక్‌ పెట్టాలంటే ఈ సీజన్‌ లో దొరికే అన్ని కూరగాయలతో జ్యూస్‌ చేసుకుని తాగడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఎన్నో సమస్యలు దూరం అవుతాయని వారు పేర్కొంటున్నారు. ముఖ్యంగా క్యారెట్‌ జ్యూస్ చేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వివరిస్తున్నారు.

క్యారెట్‌ జ్యూస్‌ తాగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలకు చెక్‌ పెట్టొచ్చు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా శరీరానికి కావాల్సిన శక్తిని, పోషకాలను కూడా అందిస్తుంది. డైలీ ఓ గ్లాస్ క్యారెట్‌ జ్యూస్‌ తాగితే శరీరాన్ని ఫ్రీ రాడికల్ష్‌ నుంచి పాడు కాకుండా కాపాడుతుంది. వైరస్‌ ల నుంచి బ్యాక్టీరియాల నుంచి రక్షణ కల్పిస్తుంది.

చర్మ సంబంధ సమస్యలు లేకుండా చేస్తుంది. క్యారెట్‌ లో ఉండే బీటా కెరోటిన్‌ విటమిన్‌ ఏ కి సంబంధించిన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కొత్త కణజాలాన్ని ప్రోత్సహిస్తాయి. అంతేకాకుండా మహిళలు ఎదుర్కొనే ప్రధాన సమస్య మొటిమల సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల క్రమం తప్పకుండా క్యారెట్‌ జ్యూస్‌ తీసుకుంటే కనుక కంటి జబ్బులు రాకుండా ఉంటాయి.

బ్లడ్‌ షుగర్ తో బాధపడేవారు క్యారెట్‌ జ్యూస్‌ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. దీనిని తీసుకోవడం వల్ల గ్లూకోజ్‌ లెవల్స్‌ తగ్గుతాయి. క్యారెట్ లో ఉండే కేలరీలు, విటమిన్లు, మినరల్స్‌ షుగర్‌ ను నియంత్రిస్తాయి. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. క్యారెట్‌ లో ఉండే విటమిన్‌ సీ, ఐ అలాగే ఫోలెట్స్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరగకుండా నియంత్రిస్తుంది.

క్యారెట్ తీసుకోవడం వల్ల కంటి చూపునకు చాలా మంచిది. విటమిన్‌ ఏ అధికంగా ఉండటం వల్ల క్రమం తప్పకుండా క్యారెట్‌ తీసుకోవడం వల్ల కంటి జబ్బులు రాకుండా ఉంటాయి. రేచీకటి సమస్యకు మంచి పరిష్కారం దొరుకుతుంది. కంటి జబ్బులు వచ్చాయంటే అది కేవలం విటమిన్‌ ఏ లోపం వల్లే.

ఇలా క్యారెట్ లో ఎన్నో పోషకాలు ఉండటంతో దీన్ని తీసుకుని మంచి ఆరోగ్యం కలిగించేలా చేస్తుంది. ఈ క్రమంలో క్యారెట్ ను రెగ్యులర్ గా తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించాలి.

Also read: నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా మీ రుణం తీర్చుకోలేను: కేటీఆర్‌!

#benifits #juice #carrot
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe