Bellamkonda Sreenivas : తెలుగులో ఫ్లాప్.. అక్కడ మాత్రం సూపర్ హిట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'జయ జానకి నాయక' చిత్రం అరుదైన రికార్డు సృష్టించింది. యూట్యూబ్ లో రిలీజైన ఈ సినిమా హిందీ వెర్షన్ రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది. తాజాగా 800 మిలియన్ వ్యూస్ తో ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. పెన్ మూవీస్ నిర్మాణ సంస్థ ఈ విషయాన్నీ వెల్లడించింది.

Bellamkonda Sreenivas : తెలుగులో ఫ్లాప్.. అక్కడ మాత్రం సూపర్ హిట్
New Update

Bellamkonda Sreenivas : టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Sreenivas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2014 లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో.. చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ , తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ ఆరంభంలోనే బోయపాటి శ్రీను, వీవీ వినాయక్, తేజ వంటి స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసి తనకంటూ సెపెరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు.

'జయ జానకి నాయక' రికార్డు

అయితే తాజాగా ఈ యంగ్ హీరో నటించిన 'జయ జానకి నాయక'(Jaya Janaki Nayaka) చిత్రం అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా రిలీజై ఐదేళ్లు దాటిపోయిన.. క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. యూట్యూబ్(YouTube) లో రిలీజైన ఈ సినిమా హిందీ వెర్షన్ రికార్డు వ్యూస్(Record Views) తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ మూవీ 800 మిలియన్ వ్యూస్ తో ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్నీ బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ మూవీస్ వెల్లడించింది. "800 మిలియన్ వ్యూస్ తో 'జయ జానకి నాయక' చిత్రం ప్రేక్షకులను అలరిస్తోంది. యూ ట్యూబ్ లో అతి ఎక్కువ మంది వీక్షించిన ఇండియన్ సినిమా అంటూ ట్వీట్ చేసింది".

Also Read:   ‘శీలావతిగా’.. అనుష్క.. 14 ఏళ్ళ తర్వాత మరో సారి క్రిష్, అనుష్క కాంబో రిపీట్

హిందీలో డబ్ చేసిన ఈ సినిమా కొద్దీ రోజుల్లోనే "800 మిలియన్ వ్యూస్ సాధించి సినిమా చరిత్రలో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలకు కూడా సాధ్యం కానీ ఈ ఘనత.. ఇండియన్ సినిమా(Indian Cinema) సాధించడం విశేషం. 'జయ జానకి నాయక' సినిమా తర్వాత 772 మిలియన్ వ్యూస్ తో యష్.. కేజీఎఫ్ పార్ట్‌1 ఉంది. ఇది ఇలా ఉంటే రీసెంట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన ఫలితాన్ని అందిచలేకపోయింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో టైసన్ నాయుడు, స్టూవర్ట్ పురం దొంగ సినిమాల్లో నటిస్తున్నారు.

Also Read : Operation Valentine Trailer : “ఏం జరిగిన చూస్కుందాం”.. ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్

#record-views-in-hindi-version #jaya-janaki-nayaka-movie #bellamkonda-sai-sreenivas #youtube-views
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి