Dark Circles: కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నాయా? డార్క్ సర్కిల్స్‌ తగ్గించే టిప్స్ ఇవే!

మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మఖ్యం. డార్క్‌ సర్కిల్స్‌ రాకుండా ఉండటానికి కొన్ని టిప్స్‌ ఉన్నాయి. వాటిలో హైడ్రేటెడ్‌గా ఉండడం, ప్రతి రాత్రి 7-9 గంటల క్వాలిటీ స్లీప్‌ ఉండడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, కలబంద జెల్‌ని స్కిన్‌కి యూజ్‌ చేయడం లాంటి చిట్కాలు ఉన్నాయి. మరింత సమాచారం కోసం పైన హెడ్డింగ్‌పై క్లిక్‌ చేయండి.

New Update
Dark Circles: కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నాయా? డార్క్ సర్కిల్స్‌ తగ్గించే టిప్స్ ఇవే!

చాలా మందికి కళ్ళ కింద నల్లటి వలయాలు ఉంటాయి. ఫేస్‌ ఫెయిర్‌గా ఉన్నా ఇవి ఉంటే ముఖం కళ లేకుండా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ డార్క్ సర్కిల్స్‌ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. శరీరంలో సీరియస్‌ హెల్త్‌ కండిషన్స్‌ని దాగి ఉన్నాయని సూచించేందుకు ఇలా వస్తుంటాయని డాక్టర్లు చెబుతుంటారు. కొంతమంది థైరాయిడ్‌ సమస్య ఉన్నవాళ్లకి కూడా ఇలా డార్క్‌ సర్కిల్స్‌ వస్తుంటాయి. మరికొందరికి మాత్రం ఇది చాలా సాధారణ సమస్య. దీనికి గురించి అసలు వర్రి అవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ నల్లటి వలయాలను రిమూవ్‌ చేసేందుకు కొందరు బయట దొరికే ప్రొడక్ట్స్‌ వాడుతుంటారు. కానీ ఇవి కొన్ని సార్లు స్కిన్‌ని పాడు చేయవచ్చు. అందుకే బయట క్రీములు వాడేముందు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం అవసరం. అవి కాకుండా కొన్ని హోం టిప్స్‌ పాటించినా డార్క్‌ సర్కిల్స్‌ తగ్గే అవకాశం ఉంటుంది. అవేంటో తెలుసుకోండి.

నిత్యం చర్మ సంరక్షణ ముఖ్యం: మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మఖ్యం. దీని కోసం మాయిశ్చరైజింగ్‌, ఎక్స్‌ఫోలియేషన్‌ని తప్పక పాటించాలి. ఇలా ప్రతీరోజూ చేయాలి. చర్మ సంరక్షణ దినచర్యను అనుసరించాలి. అంటే డైలీ రోటిన్‌ పనుల్లో ఇవి కూడా భాగం కావాలి.

సూర్యరశ్మి: ఎక్కువ సేపు సూర్యుడికి ఎక్స్‌పోజర్‌ ఉండడం వల్ల అనేక చర్మసమస్యలు రావొచ్చు. ఇది మీ కళ్ళ చుట్టూ ఉన్న చర్మంలో పిగ్మెంటేషన్‌కు దారితీస్తుంది. సూర్యుని హానికరమైన యూవీ కిరణాల నుంచి మీ కంటి కింద ఉన్న ప్రాంతాన్ని రక్షించడానికి సన్‌స్క్రీన్ లేదా సన్ గ్లాసెస్ ధరించండి.

కోల్డ్ కంప్రెస్: కోల్డ్ కంప్రెస్‌ను అప్లై చేయడం కూడా రిలీఫ్‌ ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కంటికింద వాపు ఉంటే అది తాత్కాలికంగా తగ్గుతుంది. ఎందుకంటే రక్త ప్రసరణ అన్నది ముఖ్యం. కంప్రెస్‌ యూజ్‌ చేయవం వల్ల బ్లడ్‌ ఫ్లో మెరుగుపడుతుంది.

నిద్ర: నిద్రలేమి సమస్యతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మంచి నిద్ర ఫేస్‌ని ఫెయిర్‌గా కనిపించేలా చేస్తుంది. చర్మాన్ని రక్షించడంలో నిద్రపాత్ర ఎక్కువ. నిద్రలేమి నల్లటి వలయాలకు ఒక సాధారణ కారణం. మీరు ప్రతి రాత్రి 7-9 గంటల క్వాలిటీ స్లీప్‌ ఉండాలని గుర్తుపెట్టుకోండి.

హైడ్రేషన్: మీ చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా ఉంచడానికి పుష్కలంగా నీరు తాగండి. వాటర్‌ సరిపడా తాగడవ వల్ల చర్మం హెల్తీగా ఉంటుంది.

కలబంద జెల్: కలబంద జెల్‌లో అలోసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మీ చర్మంపై అధిక పిగ్మెంటేషన్‌ను నివారించడంలో సహాయపడుతుంది.

బంగాళాదుంప: బంగాళాదుంప రసంలో అజెలైక్ యాసిడ్‌ ఉంటుంది. ఇది పిగ్మెంటేషన్‌ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇది డార్క్ సర్కిల్స్‌ని తగ్గిస్తుంది.

సమతుల్య ఆహారం: చర్మ ఆరోగ్యానికి తోడ్పడే అవసరమైన విటమిన్లు, మినరల్స్ పొందడానికి పండ్లు, కూరగాయలు అధికంగా ఉండే ఆహారం తీసుకోండి.

➡ ఏ ఆరోగ్య సమస్యకైనా సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం చాలా అవసరం. వారి సలహాలు, సూచనలు పాటించండి. కేవలం ఇంటర్‌నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా సొంత చికిత్సలు తీసుకోవద్దు.

Also Read: దసరాలోపు వీటిని ఇంటికి తెచ్చుకుంటే…మీరు పట్టిందల్లా బంగారమే..!!

Advertisment
తాజా కథనాలు