Beauty Tips : ఏలకుల ఫేస్ మాస్క్.. మెరిసే చర్మం మీ సొంతం..!

భారతీయ వంటకాల్లో అనేక రకాల మసాలాలు వాడతారు. వాటిలో ఒకటి ఏలకులు. ఇవి ఆహారానికి మంచి రుచిని అందించడం మాత్రమే కాదు చర్మ సౌదర్యానికి కూడా పెంచుతాయి. ఏలకులతో తయారు చేసిన ఫేస్ మాస్క్ మెరిసే అందమైన నిగారింపును అందిస్తుంది.

New Update
Beauty Tips : ఏలకుల ఫేస్ మాస్క్.. మెరిసే చర్మం మీ సొంతం..!

Cardamom Face Pack : భారతీయ వంటకాల్లో(Indian Dishes) అనేక రకాల మసాలాలు వాడతారు. ఆహార రుచిని పెంచే ఈ మసాలాలు(Masala's) మీ చర్మానికి కూడా అద్భుతాలు చేయగలవని మీకు తెలుసా..? ఏలకులతో మెరిసే చర్మాన్ని పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాము..

మెరిసే చర్మం కోసం ఏలకులను ఈ విధంగా ఉపయోగించండి

ఏలకుల ఫేస్ ప్యాక్

ఏలకుల పేస్ట్(Cardamom Paste) చర్మం పై మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది. దీని కోసం 5-10 యాలకులు తీసుకోవాలి. వాటిని పొడిగా చేసి.. దాంట్లో కొంచెం తేనే, పాలు కలుపుకోవాలి. ఈ పేస్ట్ మొహం పై అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఈ ఫేస్ ప్యాక్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత నెమ్మదిగా తీసి మొహాన్ని శుభ్రం చేయండి. మొహాన్ని చల్లటి నీటితో కడగాలి. మెరిసే చర్మం కోసం, ఈ పేస్ట్‌ను వారానికి కనీసం 3 సార్లు ముఖానికి రాయండి.

పెరుగు, ఏలకుల పేస్ట్

మెరిసే చర్మం కోసం ఏలకులు, పెరుగు మిశ్రమం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఏలకులు, పెరుగు కలిపిన పేస్ట్ మొహానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. అవసరమైతే దీంట్లో శనగపిండి కూడా కలుపుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి కనీసం 2 నుండి 3 సార్లు ఉపయోగించండి.

publive-image publive-image

ఏలకుల నీరు

మెరిసే చర్మం కోసం, ప్రతిరోజూ ఉదయం ఏలకుల నీటితో మీ ముఖాన్ని కడగాలి. దీని కోసం, ముందుగా ఒక గ్లాసు నీటిలో 2-3 ఏలకులు వేసి మరిగించాలి. నీరు చల్లబడిన తర్వాత, ఈ నీటితో మీ ముఖం కడగాలి. ఇది కాకుండా, మీరు రోజువారీ ఆహారంలో ఏలకులను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మీ చర్మం మెరిసేలా చేయడమే కాకుండా నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. మీకు ఏదైనా రకమైన అలెర్జీ ఉన్నట్లయితే, ఏలకులు తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Life Style: స్వీట్స్ అతిగా తింటున్నారా..? అకాల వృద్ధాప్యం తప్పదు..!

Advertisment
తాజా కథనాలు