ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ జనగాం జిల్లా పాలకుర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే సభ ముగిసిన అనంతరం ప్రియాంక గాంధీ.. అక్కడ స్థానికంగా నివాసం ఉంటున్న ఓ దంపతుల ఇంటికి వెళ్లింది. ప్రియాంక గాంధీ అలా అకస్మాత్తుగా వారి ఇంటికి రావడంతో ఆ దంపతులు ఆమెను చూసి ఒక్కసారిగా ఆనందంతో పొంగిపోయారు. ప్రియాంక గాంధీ ఆ మహిళను హత్తుకొని, తలపై ముద్దిచ్చారు. సంతోషంలో మునిగిపోయిన ఆ మహిళ.. తాను ఇందిరాగాంధీని చూడాలనుకొని చూడలేకపోయానని.. చివరికి ఆవిడ మనువరాలిని చూశానంటూ ఆనందం వ్యక్తం చేసింది.
Also Read: కేటీఆర్ మాటలు వింటే నవ్వొస్తోంది.. రాష్ట్రంలో తాలిబాన్ పాలన: ట్విట్టర్లో షర్మిల విమర్శలు
ఇదిలా ఉండగా.. పాలకుర్తి సభలో ప్రసంగించిన ప్రియాంక గాంధీ.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం యువత భవిష్యత్తును చీకటిలోకి నెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని.. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించామని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తాము రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయాలని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉంటే.. వాళ్ల కోసం మాత్రమే పనిచేసుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మార్పు రావాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అమరుల ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయో ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
Also read: వడ్డీ లేకుండా హోం లోన్స్… సంచలన స్కీం ప్రకటించిన కేటీఆర్..!!