Waynad Nature Disaster: కేరళలోని వయనాడ్ జిల్లా ప్రకృతి విపత్తులతో అతలాకుతలమైంది. భారీ వర్షం కారణంగా వాయనాడ్ కొండచరియలు విరిగిపడటంతో 108 మంది మరణించారు. గ్రామాలకు గ్రామాలే నామరూపాలు లేకుండా పోయాయి. ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి. భారీ రెస్క్యూ ఆపరేషన్‌లు జరుగుతున్నాయి. కొంతమందినే వెలికితీయగలిగారు. ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కకుని పోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం, జూలై 30, బుధవారం, జూలై 31వ తేదీలలో రెండు రోజుల రాష్ట్రవ్యాప్త సంతాప దినాలను ప్రకటించారు. ఈ ప్రమాదంలో 116 గాయాలవగా.. చాలామంది అచూకీ తెలియలేదని కేరళ రెవెన్యూ మంత్రి కార్యాలయం నివేదించింది.
అరేబియా సముద్రం వేడెక్కిపోయింది...
ఈ ప్రకృతి పరిణామం మీద శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అరేబియా సముద్రం వేడెక్కడమే కారణమని భావిస్తున్నారు. చాలా కొద్ది సేపటిలోనే మామూలు వర్షాల నుంచి భారీ వర్షాు పడ్డయని...దాని కారణంగానే కొండచరియలు విరిగపడ్డాయని చెబుతున్నారు. అరేబియా సముద్రం వేడెక్కడం కారణంగా డీప్ క్లౌడ్ సిస్టమ్స్ ఏర్పడి.. తక్కువ వ్యవధిలో కేరళలో అత్యంత భారీ వర్షాలు కురిశాయని చెబుతున్నారు. రుతుపవాలు దానికి తోడు ఆఫ్ షోర్ ద్రోణి కూడా ఏర్పడిందని...దాని వలన కాసర్‌గోడ్, కన్నూర్, వాయనాడ్, కాలికట్, మలప్పురం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లోని అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రాడార్ రీసెర్చ్ డైరెక్టర్ ఎస్ అభిలాష్ తెలిపారు. అరేబియా సముద్రంలో మేసోస్కల్ క్లౌడ్ వ్యవస్థ ఏర్పడింది. దీనికి కారణం కొంకణ్ ప్రాంతం తేమగా ఉండడమే అని తెలిపారు. ఈ కారణాల వల్లనే వాయనాడ్, కాలికట్, మలప్పురం, కన్నూర్‌లలో అత్యంత భారీ వర్షాలు కురిశాయని..ఆ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని ఆయన తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 30 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని అభిలాష్ చెప్పారు.