Make up Tips: రోజూ మేకప్ వేసుకుంటున్నారా జాగ్రత్త..ఈ సమస్యలు తప్పవు

ఈ రోజుల్లో సెలబ్రిటీల నుంచి సామాన్య మహిళల వరకు మేకప్‌ను ఎంతో ఇష్టంగా వేసుకుంటున్నారు. ఫంక్షన్‌, పార్టీలు ఉన్నప్పుడైతే ఈ మేకప్ తప్పనిసరిగా ఉండాలి. అయితే మేకప్‌ను రోజూ వేసుకుంటే మొటిమలు, చర్మం పొడిబారడం, వృద్ధాప్య ఛాయలు వంటి సమస్యలు వస్తాయి.​​

New Update
Make up Tips: రోజూ మేకప్ వేసుకుంటున్నారా జాగ్రత్త..ఈ సమస్యలు తప్పవు

Make Up Tips: ఈ రోజుల్లో మేకప్ అంటే అమ్మాయిలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీల నుంచి సామాన్య మహిళల వరకు ఎంతో ఇష్టంగా స్పెషల్‌గా ఈ మేకప్‌ని వేసుకుంటారు. ఫంక్షన్‌, పార్టీలు ఉన్నప్పుడైతే ఈ మేకప్ తప్పనిసరిగా ఉండాలి. ఇష్టంతోనే కాదు కొంతమంది మహిళలు ఉద్యోగ రీత్యా కూడా మేకప్‌ను వేసుకోవాల్సి ఉంటుంది. రోజు మేకప్ వేసుకుంటే శరీరంపై ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉంది. మేకప్‌లో ఉండే కెమికల్ కారణంగా చర్మం దెబ్బతింటుంది. ఈ మేకప్‌ను రోజూ వేసుకుంటే మొటిమలు, చర్మం పొడిబారడం, వృద్ధాప్య ఛాయలు వంటి సమస్యలు త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది.  అయితే.. తరచూ మేకప్ వేసుకునే వాళ్ళు చర్మాని ఎలా రక్షించుకోవాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం.
మేకప్ వేసుకునేటప్పుడు జాగ్రత్తలు అవసరం:
హానికరమైన పదార్థాలకు దూరం: ఈ మధ్యకాలంలో సువాసన, రంగు కోసం రకరకాల విషపూరితమైన కెమికల్‌తో కలిసిన క్రీములు వస్తున్నాయి. ఇవి వాడటం వల్ల చర్మానికి హాని చేస్తాయి. మీరు మేకప్‌లో కెమికల్స్‌ లేకుండా జాగ్రత్త పడితే మంచిది. సాధ్యమైనంత వరకు సహజ ఉత్పత్తులను వాడితే ఆరోగ్యానికి, చర్మానికి చాలా మంచిది. ఇలాంటి సురక్షితమైన మేకప్‌లు ఎంచుకుంటే ఎలాంటి సమస్యలు దరి చేరవు.
సరైన బేస్ అవసరం: మేకప్ వేసుకునే ముందు చర్మానికి బేస్ అప్లై చేయడం చాలా ముఖ్యం. డే టైంలో బిబి క్రీమ్స్, ఫౌండేషన్‌ పెట్టుకునే తీసేటప్పుడు సన్‌ స్ర్కీన్‌లు, మార్చరైజర్ వంటివి అప్లై చేసుకోవాలి. సాయంత్రం సమయంలో మేకప్ వేసుకుంటే నీటి అధారిత మాశ్చరైజర్లను వేసుకుంటే చర్మాన్ని హైడ్రేట్ చేయడం అవసరం.
మేకప్ బ్రష్ శుభ్రం: చాలామంది మేకప్ వేసుకున్న తర్వాత ఆ బ్రష్‌ను శుభ్రం చేసుకోరు. వీటిని శుభ్రం చేసుకుని వాడటం చాలా అవసరం. ప్రతిరోజు మేకప్ వేసుకునే వాళ్ళు వారానికి రెండు నుంచి మూడుసార్లు శుభ్రం చేసిన తరువాత హెయిర్‌డ్రైర్‌తో స్పాంజ్‌లు, బ్రష్‌లను ఆరబెట్టుకుంటే మంచిది .

మేకప్‌ రిమూవ్: మేకప్ వేసుకున్న తర్వాత సరిగ్గా రిమూవ్ చేసుకోరు. దీనివల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మేకప్ తొలగించే సమయంలో రిమూవర్‌ను ఉపయోగించినా, గట్టిగా రుద్ది మరి శుభ్రం చేస్తుంటారు. అయితే.. ఇలా చేస్తే చర్మం డ్యామేజీ అయ్యే అవకాశం ఉంది. అందుకే మేకప్ తీసే ముందు నెమ్మదిగా తీసుకోవాలంటున్నారు.  తర్వాత కొద్దిగా కొబ్బరి నూనెతో ముఖానికి, మెడకు పట్టించి తర్వాత కాటన్ ప్యాడ్లతో దానిని శుభ్రం చేసుకోవాలి.
తేమనందించండి: మార్కెట్లో దొరికే కొన్ని రకాల మేకప్ రిమూవర్‌ను చర్మంలోని సహజసిద్ధమైన నూనెల్ని పోగొడుతుంది. తద్వారా చర్మం పొడిబారి పోతుంది. అలాంటప్పుడు మేకప్ తొలగించుకొని ముఖం శుభ్రం చేసుకున్న వెంటనే చర్మానికి మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.

Also Read: రెడ్ క్యాప్సికంతో అధిక బరువు తగ్గొచ్చా.. ఇలా చేస్తే ఎంతో ఉపయోగం

Advertisment
Advertisment
తాజా కథనాలు