Gym Workouts: నేటి జీవనశైలిలో జిమ్‌కి వెళ్లడం, ఫిట్‌గా ఉండడం ముఖ్యమైన భాగంగా మారింది. కానీ కొన్నిసార్లు కష్టపడి పనిచేయడం, తప్పుడు మార్గంలో వ్యాయామాలు చేస్తే తీవ్రమైన వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు . ఈ వ్యాధులు ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా దీర్ఘకాలంలో ఫిట్‌నెస్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల జిమ్‌లో వ్యాయామం చేసేటపుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. జిమ్‌కి వెళ్లడం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో, వాటిని ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
జిమ్ వర్కౌట్‌తో ఆనారోగ్య ప్రమాదాలు:
- బరువులు ఎత్తేటప్పుడు, జిమ్‌లో స్ట్రెచింగ్ చేస్తున్నప్పుడు కండరాల ఒత్తిడి పడుతుంది. కండరాలపై అధిక ఒత్తిడి పడితే నొప్పి, వాపు, కండరాల బలహీనతకు కారణం కావచ్చు.
- తప్పుడు మార్గంలో వ్యాయామం చేస్తే కీళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది కీళ్లలో నొప్పి, వాపుకు కారణమవుతుంది. దీన్ని నివారించడానికి సరైన జిమ్ ట్రైనర్‌ని సంప్రదించాలి.
- జిమ్‌లో ఎక్కువ కార్డియో వ్యాయామం చేయడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే గుండె సంబంధిత సమస్య ఉంటే జిమ్‌లో వ్యాయామం చేసే ముందు ఖచ్చితంగా డాక్టర్లని సంప్రదించాలి. పరిమితుల ప్రకారం మాత్రమే వ్యాయామం చేయాలి.
- జిమ్‌లో ఎక్కువ చెమట పట్టడం వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. దీనిని డీహైడ్రేషన్ అంటారు. దీనివల్ల బలహీనత, తల తిరగడం, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. జిమ్‌కు వెళ్లేటప్పుడు తగినంత నీరు తాగితే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవచ్చు.
- జిమ్‌లో బరువును తప్పుగా ఎత్తడం, అకస్మాత్తుగా తిరగడం వల్ల ఎముకలకు చెందిన లిగమెంట్‌లకు గాయం కావచ్చు. ఇది నొప్పి, వాపుకు, ఎక్కువసేపు వ్యాయామం చేయడం కష్టతరం చేస్తుంది. దీన్ని నివారించాలంటే సరైన స్థితిలో వ్యాయామం చేయడం, అధిక బరువును ఎత్తకుండా ఉండాలి.
వ్యాధుల నివారణ మార్గాలు:
వ్యాయామం చేసే ముందు సరైన టెక్నిక్, స్థానం, శిక్షకుడి సహాయం తీసుకోవాలి. శారీరక సామర్థ్యానికి అనుగుణంగా మాత్రమే వ్యాయామం చేయాలి. వ్యాయామం చేసే సమయంలో తర్వాత తగినంత నీరు తాగాలి. ఏదైనా వ్యాయామం నొప్పి, అసౌకర్యాన్ని కలిగిస్తే వెంటనే విశ్రాంతి తీసుకోకుని శరీరానికి సమయం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read : ఔటర్‌పై మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి!