BCCI New Rule to Play IPL: ఐపీఎల్ అంటే ఆటగాళ్లకు కాసుల పంట. ముఖ్యంగా యంగ్ ప్లేయర్లు ఐపీఎల్‌లో రాణించి జాతీయ జట్టులోకి రావాలని తెగ ప్రయత్నిస్తుంటారు. ఇందులో ఏ మాత్రం తప్పు లేదు.. డబ్బులు సంపాదించడం ఎవరికైనా అవసరమే. అయితే టీ20లు, టెస్టులు వేరు వేరు. అందుకే గతంలో రంజీ క్రికెట్‌ను ప్రతిభకు కోలమానంగా భావించేవాళ్లు. అయితే ఇప్పుడా రోజులు పోయినట్టే కనిపిస్తున్నాయి. అటు బీసీసీఐ కూడా ఐపీఎల్‌కే పెద్ద పీట వేస్తూ వచ్చింది. కానీ రిజల్ట్స్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో లేదు ఫైనల్ లేదా సెమీస్‌లో చోక్ అవ్వడం ఇండియాకు అనవాయితీగా వస్తోంది. దీంతో బీసీసీఐపై విమర్శలు పెరిగాయి. సర్ఫరాజ్ లాంటి ఆటగాళ్లు దేశవాళీ మ్యాచ్‌ల్లో ఎంత ఆడుతున్నా తీసుకోవడం లేదని విమర్శలు గుప్పుమన్నాయి. ఇక బీసీసీఐ కూడా రంజీ టాలెంట్‌ని యూటిలైజ్ చేసుకోవాలని భావిస్తోంది. అయితే పలువురు ఆటగాళ్లు రంజీలు ఎగొట్టి ఐపీఎల్‌కు రెడీ అవుతున్నారని అర్థమవడంతో సీరియస్ అయ్యింది.
ఇషాన్ కిషన్ ఎందుకిలా?
జార్ఖండ్‌కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చిపోతుంటాడు. జట్టులో ఇప్పటివరకు స్థానాన్ని సెటిల్ చేసుకోలేదు. గత దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ మధ్యలో మెంటల్ ఇష్యూస్ అని చెప్పి లీవ్ తీసుకున్న ఇషాన్.. ఆ వెంటనే దుబాయ్‌లో వాలిపోయాడు. ధోనీతో కలిసి పార్టీ చేసుకున్నాడు. పార్టీ చేసుకుంటే చేసుకోవచ్చు కానీ ఇషాన్ అబద్ధం చెప్పి దుబాయ్ వెళ్లాడన్న అనుమానం బీసీసీఐకి వచ్చింది. కాస్త నిర్ధారించుకోని చివాట్లు కూడా పెట్టినట్టుగా టాక్.
ఇక ఇదే సమయంలో రంజీ సీజన్ మొదలైంది. ఇషాన్ తన జట్టుకు ఆడకుండా పాండ్యాతో కలిసి రానున్న ఐపీఎల్ సీజన్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టినట్టుగా తెలిసింది. దీనిపై మరింత సీరియస్ అయ్యింది. రంజీలు పక్కన పెట్టి ప్రాక్టీస్ చేస్తుండడాన్ని అంగీకరించలేదు బీసీసీఐ. వెంటనే ఆదేశాలు జారీ చేసింది. రంజీలు ఆడితేనే ఐపీఎల్‌లో ఆడాలని షరతు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఐపీఎల్ ఆడటానికి కనీసం 3-4 రంజీ మ్యాచ్‌లు ఆడాలని ఆదేశించినట్టుగా సమాచారం.
Also Read: ఏడు నెలల్లో మూడుసార్లు.. కంగారూల దెబ్బకు టీమిండియా అభిమానులకు కన్నీళ్లు!
WATCH: