ప్లీజ్ అప్పటివరకూ ఉండు.. రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ రిక్వెస్ట్?

2023 వరల్డ్ కప్ ఫైనల్ తో కోచ్‌గా ద్రవిడ్ కాంట్రాక్ట్‌ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే మరో రెండేళ్లు అవకాశం ఇస్తామన్న బీసీసీఐ ప్రతిపాదనను ఇప్పటికే ద్రవిడ్‌ తిరస్కరించారు. దీంతో కనీసం 2024 టీ20 వరల్డ్ కప్ వరకూ బాధ్యతలు చేపట్టాలని బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది.

New Update
ప్లీజ్ అప్పటివరకూ ఉండు.. రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ రిక్వెస్ట్?

టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను వదులుకునేందుకు బీసీసీఐ ఇష్టపడట్లేదు. ఇప్పటికే ద్రవిడ్‌ను కొనసాగించాలనే బీసీసీఐ నిర్ణయానికి భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ, చీఫ్‌ సెలక్టర్ అజిత్‌ అగార్కర్‌ కూడా మద్దతుగా నిలిచారు. కానీ ద్రవిడ్ మాత్రం ఇందుకు విముఖత చూపుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చే యేడాది టీ20 వరల్డ్ కప్ వరకూ ఎలాగైనా ద్రవిడ్ ను కోచ్ గా కొనసాగించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మరోసారి ద్రవిడ్ కు రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ద్రవిడ్ ఈ ఆఫర్‌కు అంగీకరిస్తే.. బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాఠోడ్, బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రేలు అతడితోపాటు కొనసాగే అవకాశం ఉంది.

Also read :ఏపీలో మరో కొత్త పార్టీ? జేడీ లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన

ఇక డిసెంబర్‌ 10 నుంచి జనవరి 7 వరకు దక్షిణాఫ్రికా పర్యటన కొనసాగనుండగా ఈ సిరీస్ కు ద్రవిడ్‌ను హెడ్ కోచ్ గా పంపించేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు ‘కాంట్రాక్ట్‌ కొనసాగింపుపై చర్చలు జరుగుతూనే ఉంటాయి. అయితే, దక్షిణాఫ్రికాతో సిరీస్‌ చాలా కీలకం. ఈ పర్యటనలోని టీ20 సిరీస్‌కు వెళ్లకూడదని ద్రవిడ్‌ భావిస్తే.. వన్డేల నాటికి భారత జట్టుతో కలవచ్చు’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. దక్షిణాఫ్రికా పర్యటనకు ద్రవిడ్‌నే పంపాలని యాజమాన్యం బలంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. లక్ష్మణ్‌కు అవకాశంపై స్పందిస్తూ.. అతడు ఇప్పటికే ఎన్‌సీఏ పనులతో బిజీగా ఉన్నాడని, అండర్-19 వరల్డ్‌ కప్‌ కూడా సమీస్తున్న తరుణంలో దక్షిణాఫ్రికా పర్యటనకు పంపడమూ కష్టమేనని బీసీసీఐ అధికారులు తెలిపారు. ఇక ప్రస్తుతం లక్ష్మణ్‌ ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇదిలావుంటే.. ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తొలిసారే కప్‌ సాధించడంలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యతోపాటు భారత మాజీ పేసర్‌ ఆశిశ్ నెహ్రా కూడా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఆశిశ్‌ను పొట్టి ఫార్మాట్‌కు భారత కోచ్‌గా బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ భావించిందని సమాచారం. కానీ, ఆశిశ్ మాత్రం ఈ పదవి తీసుకోవడానికి అంగీకరించకపోవడంతో మళ్లీ రాహుల్‌ ద్రవిడ్‌ వైపే బీసీసీఐ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు