World Cup 2023: హెచ్‌సీఏకు బీసీసీఐ ఝలక్.. షెడ్యూల్‌ ప్రకారమే మ్యాచ్‌లు

భద్రతా కారణాల దృష్ట్యా వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిని బీసీసీఐ తిరస్కరించింది. షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదని.. యధాప్రకారం మ్యాచులు జరుగుతాయని స్పష్టంచేసింది.

New Update
World Cup 2023: హెచ్‌సీఏకు బీసీసీఐ ఝలక్.. షెడ్యూల్‌ ప్రకారమే మ్యాచ్‌లు

World Cup 2023: భద్రతా కారణాల దృష్ట్యా వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) చేసిన విజ్ఞప్తిని బీసీసీఐ (BCCI) తిరస్కరించింది. షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదని.. యధాప్రకారం మ్యాచులు జరుగుతాయని స్పష్టంచేసింది. మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మార్చడం కుదరదని బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ శుక్లా (Rajiv Shukla) స్పష్టంచేశారు. ప్రపంచకప్‌(World Cup 2023)లో హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచులకు తానే బాధ్యతలు నిర్వహిస్తున్నానని శుక్లా తెలిపారు. సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను మార్చడం అంత సులువు కాదన్నారు. షెడ్యూల్‌ను మార్చే నిర్ణయంపై బీసీసీఐ మాత్రమే కాదు ఆయా జట్లతోపాటు ఐసీసీ కూడా స్పందించాల్సి ఉంటుందని వెల్లడించారు.

వరల్డ్‌కప్ కొత్త షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వరుసగా రెండు రోజులు మ్యాచ్‌లను నిర్వహించాల్సి ఉంది. అక్టోబర్ 9న న్యూజిలాండ్- నెదర్లాండ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా.. అక్టోబర్ 10న పాకిస్థాన్-శ్రీలంక టీమ్స్ మధ్య మ్యాచ్ ఉండనుంది. వరుసగా రెండు రోజుల పాటు మ్యాచ్‌లు నిర్వహణకు భద్రత కష్టమని పోలీసు అధికారులు హెచ్‌సీఏ అధికారులకు తెలిపారు. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా షెడ్యూల్‌లో మార్పులు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐకి లేఖ రాసింది. రెండు మ్యాచ్‌ల మధ్య కొంత గ్యాప్ ఇవ్వాలని విజ్ఞప్తిచేసింది. అయితే బీసీసీఐ కుదరదు అని చెప్పడంతో హెచ్‌సీఏ ఇరకాటంలో పడింది.

ఇక భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ విడుద‌ల చేసింది. అక్టోబర్ 5వ తేదీన డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభంకానుంది. ఇక యావత్ ప్రపంచం ఎంతగానో ఎదురుచూసే భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ అహ్మ‌దాబాద్ వేదిక‌గా అక్టోబ‌ర్ 14న జరగనుంది. నవంబర్ 15, 16 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్‌లు, నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి.

అయితే ఐసీసీ (ICC) ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు చేసింది. భారత్, పాక్ మ్యాచ్ స‌హా మొత్తం 9 మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు చేసింది. ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య అక్టోబ‌ర్ 15న మ్యాచ్ జ‌ర‌గాల్సి ఉంది. అయితే అక్టోబ‌ర్ 15 నుంచి న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ప్రారంభం కానుండటంతో భ‌ద్ర‌తా కార‌ణాలను దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్‌ను అక్టోబ‌ర్ 14కి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Also Read: వన్డే వరల్డ్‌ కప్‌లో పంత్‌ పరిస్థితి ఏంటి.?

Advertisment
Advertisment
తాజా కథనాలు