BCCI: స్టన్నింగ్‌ కామెంటేటర్‌కు లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌.. బ్యాటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా గిల్‌

రవిశాస్త్రికి సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. టీమిండియాకు ఆయన అందించిన విశేష సేవలకు గాను బీసీసీఐ ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, సెక్రటరీ జై షా ఆయనకు అవార్డు అందించారు.

BCCI: స్టన్నింగ్‌ కామెంటేటర్‌కు లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌.. బ్యాటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా గిల్‌
New Update

Ravi Shastri - Shubman Gill: భారత తొలి వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ టీం సభ్యుడు, మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రికి సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. టీమిండియాకు ఆయన అందించిన విశేష సేవలకు గాను బీసీసీఐ ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, సెక్రటరీ జై షా ఆయనకు అవార్డు అందించారు. ఆయనతోపాటు ఫరూక్‌ ఇంజనీర్‌ కూడా అవార్డు అందుకున్నారు. 2017-2021 సమయంలో జట్టుకు ప్రధాన కోచ్‌గా ఆయన వ్యవహరించిన సమయంలో టీమిండియా దూకుడు అలవరచుకుని ఉత్తమ ప్రదర్శనలు చేసింది.

ఇది కూడా చదవండి: ఈ సిరీస్‌లో రాహుల్ వికెట్ కీపర్‌గా ఆడటం లేదు.. ద్రవిడ్

స్టన్నింగ్‌ కామెంటరీతో శ్రోతలను మంత్రముగ్ధులను చేయగల వ్యాఖ్యాతగా పేరున్న రవిశాస్త్రితో పాటు టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌​మన్​ గిల్‌ను కూడా ఓ అవార్డు వరించింది. 'క్రికెటర్​ ఆఫ్​ ది ఇయర్​' కేటగిరీలో పాలీ ఉమ్రిగర్‌ పురస్కారానికి గిల్‌ ఎంపికయ్యాడు. వన్డేల్లో ఫాస్ట్‌గా రెండు వేల పరుగుల మైలురాయిని దాటాడు గిల్‌. అందులో ఐదు శతకాలు కూడా ఉన్నాయి. జస్‌ప్రీత్‌ బుమ్రా (2021 - 22), రవిచంద్రన్‌ అశ్విన్‌ (2020 - 21), మహ్మద్‌ షమీ (2019 - 20) గెలుచుకున్నారు. ఉత్తమ మహిళా క్రికెటర్‌గా 2020 - 21, 2021 - 22కిగానూ స్మృతి మందాన నిలిచింది. 2019 - 20, 2022 - 23 సంవత్సరాలకు దీప్తి శర్మ ఈ పురస్కారం అందుకుంది.

బీసీసీఐ మొదటిసారి 2019లో అవార్డు వేడుకలు నిర్వహించింది. అనంతరం కరోనా, ఇతర కారణాలతో ఏటా వాయిదా పడుతూ వస్తోంది. 2019లో కపిల్ దేవ్, సునిల్ గవాస్కర్, సయ్యద్ కిర్మణి, క్రిస్ శ్రీకాంత్ ఈ అవార్డు అందుకున్నారు.

వివిధ విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నవారు:

బెస్ట్‌ అంపైర్‌

పద్మనాభన్‌ (2019-20), వ్రిందా (2020-21), జయరామన్‌ మదన్‌ గోపాల్‌ (2021-22), రోహన్‌ పండిట్‌ (2022-23)

వన్డేల్లో అత్యధిక వికెట్లు (ఉమెన్‌)

పూనమ్‌ యాదవ్‌ (2019-20), జులన్‌ గోస్వామి (2020-21), రాజేశ్వరి గైక్వాడ్‌ (2021-22), దేవికా యాదవ్‌ (2022-23)

వన్డేల్లో అత్యధిక పరుగులు (ఉమెన్‌)

పూనమ్‌ రౌత్‌ (2019-20), మిథాలీ రాజ్‌ (2020-21), హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (2021-22), రోడ్రిగ్స్‌ (2022-23)

దిలీప్‌ సర్దేశాయ్‌ అవార్డు

టెస్టుల్లో అత్యధిక వికెట్లు: రవిచంద్రన్‌ అశ్విన్‌ (2022-23), టెస్టుల్లో అత్యధిక పరుగులు: యశస్వి జైస్వాల్‌ (2022-23)

బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ డెబ్యూట్‌ (ఉమెన్‌)

ప్రియా పునియా (2019-20), షెఫాలీ వర్మ (2020- 21), సబ్బినేని మేఘన (2021-22), అమన్‌జోత్‌ కౌర్‌ (2022-23)

బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ డెబ్యూట్‌ (మెన్‌)

మయాంక్‌ అగర్వాల్‌ (2019 - 2020), అక్షర్‌ పటేల్‌ (2020-21), శ్రేయస్‌ అయ్యర్ (2021-22), యశస్వి జైస్వాల్‌ ( 2022-23)

#bcci #ravi-shastri
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe