సచిన్(Sachin)ని చూడగానే నంబర్-10 గుర్తొస్తుంది.. ధోనీ(Dhoni) అనగానే నంబర్-7 గుర్తొస్తుంది. క్రికెటర్ల జెర్సీకి ఫ్యాన్స్‌కు ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. ఎంతలా అంటే చాలా మంది తమ ఫేవరెట్ నంబర్లను చెప్పమంటే తమకు ఇష్టమైన క్రికెటర్ల జెర్సీ నంబరే చెబుతారు. ఎందుకో తెలియదు.. అదోక ఎమోషన్! కోహ్లీ-18, రోహిత్-45 కూడా ఇదే లిస్ట్‌లోకి వస్తాయి కానీ.. నంబర్-10, నంబర్-7 ఫీలింగ్ వేరు. కేవలం క్రికెట్‌లోనే కాదు.. ఫుట్‌బాల్‌లోనూ ఈ జెర్సీ నంబర్స్‌కి-ఫ్యాన్స్‌కు హార్ట్‌ఫుల్ కనెక్టివిటీ ఎక్కువ. ఇటు టీమిండియా కలర్ జెర్సీలో ఆడడం మొదలుపెట్టిన తర్వాత ఫ్యాన్స్‌కు ఎక్కువగా కనెక్టైన జెర్సీలు ఈ రెండే. ఫ్యాన్స్ భావోద్వేగాలను అర్థం చేసుకున్న భారత్ క్రికెట్ బోర్డు(బీసీసీఐ) గతంలో సచిన్ సింబాలిక్ నంబర్-10 జెర్సీని రిటైర్ చేయగా.. తాజాగా ధోనీ డైనామిక్ జెర్సీ(Jersey) నంబర్-7ని కూడా రిటైర్ చేసింది.
ఇక ఎవరూ ధరించలేరు:
భవిష్యత్‌లో టీమిండియా తరుఫున ఆడే ఆటగాళ్లు ఎవరూ కూడా నంబర్-7 జెర్సీతో గ్రౌండ్‌లోకి దిగకూడదు. ఇది అంతర్జాతీయ మ్యాచ్‌లకు వర్తిస్తుంది. టీమిండియాలోకి కొత్తగా వచ్చే యువకులకు ఈ విషయం క్లియర్‌కట్‌గా చెప్పింది బీసీసీఐ. 'యువ ఆటగాళ్ళు, ప్రస్తుత భారత జట్టు ఆటగాళ్లు ధోని నంబర్-7 జెర్సీని ఎంచుకోవద్దు. ధోని ఆటకు చేసిన కృషికి గాను అతడి టీ-షర్ట్‌ను రిటైర్ చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. కొత్త ఆటగాడు నంబర్-7ని పొందలేరు, నంబర్-10 జెర్సీ ఇప్పటికే అందుబాటులో ఉన్న నంబర్‌ల జాబితా నుంచి తొలగించాం' అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఇది ఇటాలియన్ ట్రెడీషన్:
లెజెండరీ ప్లేయర్‌ల జెర్సీ నంబర్‌లను రిటైర్ చేయడం క్రీడా సంప్రదాయంలో ఒకటి. బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు, ఆరు NBA టైటిళ్ల విజేత మైకల్ జోర్డన్ జెర్సీ నంబర్-23ని కూడా ఎవరూ ధరంచిరు. ఇక 2017లో శార్దూల్ ఠాకూర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు నంబర్-10తో బరిలోకి దిగాడు. సచిన్ 2013లో క్రికెట్‌నుంచి రిటైర్ అయ్యాడు. 2012 మార్చి 18న చివరి వన్డే ఆడాడు. ఆ తర్వాత మొదటి సారిగా శార్దూల్ ఈ జెర్సీ నంబర్‌తో బరిలోకి దిగడంతో ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయ్యారు. సచిన్‌ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఫ్యాన్స్ ఫీలింగ్‌ను అర్థం చేసుకున్న బీసీసీఐ(BCCI) స్పోర్టింగ్ ట్రెడీషన్‌ని ఫాలో అయ్యింది. నంబర్-10జెర్సీని రిటైర్ చేసింది.. ఇప్పుడు ధోని విషయంలోనూ అదే చేసింది.
Also Read: మూడో టీ20లో దక్షిణాఫ్రికా చిత్తు..!
WATCH: