ఆ ఒక్కడికీ తప్ప అందరికీ రెస్ట్.. ఆసిస్ తో టీ20 సిరీస్ కెప్టెన్ గా సూర్య!

ఈ నెల 23 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించిందది. భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ మినహా వరల్డ్ కప్ జట్టులోని ప్లేయర్లందరికీ రెస్ట్ ఇచ్చారు. గాయంతో హార్దిక్ పాండ్య కూడా సిరీస్ కు దూరమయ్యాడు. సూర్య కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.

New Update
ఆ ఒక్కడికీ తప్ప అందరికీ రెస్ట్.. ఆసిస్ తో టీ20 సిరీస్ కెప్టెన్ గా సూర్య!

BCCI: ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన భారత్‌ కంగారూలతో మరోసారి తలపడబోతోంది. ఈ నెల 23 నుంచి రెండు జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ జరగబోతోంది. ఇందుకోసం బీసీసీఐ (BCCI) ప్రకటించిన భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ మినహా వరల్డ్ కప్ లో ఆడిన ప్లేయర్లెవరికీ చోటు లేకపోవడం విశేషం. గాయం కారణంగా హార్దిక్‌ పాండ్యా కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. వైస్ కెప్టెన్ గా రుతురాజ్‌ గైక్వాడ్‌ వ్యవహరించనుండగా; చివరి రెండు టీ20 మ్యాచ్‌లకు మాత్రం శ్రేయస్‌ అయ్యర్‌ ఆ స్థానంలో ఉంటాడు. తొలి మ్యాచ్‌ నవంబర్‌ 23న విశాఖపట్నంలో జరగనుండగా, పలువురు ఆటగాళ్లు ఇప్పటికే తీర నగరానికి వచ్చారు. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, ముఖేశ్ కుమార్, అర్షదీప్ సింగ్, జితేశ్, రింకూ సింగ్ తదితరులు అక్కడికి చేరుకున్నారు. శ్రేయస్ అయ్యర్ కొంత ఆలస్యంగా టీంతో చేరబోతున్నాడు. ఈ సిరీస్ లో టీమిండియా కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తారని సమాచారం. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం వరల్డ్ కప్ తో ముగిసింది.

ఇదికూడా చదవండి: ఆ పోస్టు టీమిండియా గురిచేనా!: ఇన్ స్టాలో షమీ మాజీ భార్య రీల్

టీం సభ్యులు: సూర్యకుమార్‌ యాదవ్‌(కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, జితేశ్‌ శర్మ(వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబె, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్‌, ముకేశ్‌ కుమార్‌.
ఇదే షెడ్యూల్:
నవంబరు 23- తొలి టీ20 (విశాఖపట్నం)
నవంబరు 26- రెండో టీ20 (తిరువనంతపురం)
నవంబరు 28- మూడో టీ20 (గువాహటి)
డిసెంబరు 1- నాలుగో టీ20 (నాగపూర్)
డిసెంబరు 3- ఐదో టీ20 (హైదరాబాద్)

Advertisment
Advertisment
తాజా కథనాలు