Depression: డిప్రెషన్ అంటే సినిమాలో చూపించే తాగుబోతు క్యారెక్టర్ కాదు బాసూ.. అది వేరే..! తమిళ నటుడు-కంపోజర్ విజయ్ ఆంథోనీ కుమార్తె మీరా డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటివలి కాలంలో విద్యార్థులు ఎక్కువగా డిప్రెషన్ బారిన పడుతున్నట్టు అధ్యయనలు చెబుతున్నాయి. కోపంగా ఉండడం, విచారంగా అనిపించడం, నిద్ర భంగం, ఆసక్తి కోల్పోవడం డిప్రెషన్‌కి సంబంధించిన కొన్ని లక్షణాలు. జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి లక్షణాలు మనకు ఎదురువుతాయి. By Trinath 19 Sep 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Depression: 'నేను డిప్రెషన్‌లో ఉన్నాను'.. 'చాలా డిప్రెసెడ్‌గా అనిపిస్తుంది'.. 'నేను డిప్రెషన్ నుంచి బయటపడ్డాను..' ఈ మాటలు మన ఫ్రెండ్స్ లేదా తెలిసినవాళ్లు మనతోనే అంటుంటారు. నిజానికి చాలామందికి డిప్రెషన్ అంటే లవ్ ఫెయిల్ తర్వాత వస్తుందని.. అప్పుడు సినిమాలో హీరోగారు తాగినట్టు మందుతాగుతారని.. సిగెరట్లు శరీరంపై కాల్చుకుంటారని.. అవతలి వారికి హాని చేస్తారని అనుకుంటుంటారు. అయితే ఇదంతా నిజం కాదు. సినిమా హీరో ఎమోషనల్ ఎలివేషన్ కోసం అతని బాధను చూపించేందుకు ఇలా చేస్తుంటారు. దీనికి డిప్రెషన్ అని పేరు పెడుతుంటారు. నిజానికి డిప్రెషన్(Depression) ఓ మానసిక వ్యాధి. డిప్రెషన్ పోవడానికి థెరపీ లేదా కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది. కొంతమంది మందులు కూడా రిఫర్ చేస్తుంటారు. డాక్టర్ అనుమతి లేకుండా మానసిక సమస్యల గురించి ఎలాంటి మందులు వాడకూడదు. తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ ఆంథోనీ(Vijay anthony) కూతురు మీరా డిప్రెషన్‌తో సూసైడ్ చేసుకోవడం అటు కోలివుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్ సినీ ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది. 12వ తరగతి చదువుతున్న టీనేజర్ మీరా చిన్నవయసులోనే తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకోని చనిపోవడం తీవ్రంగా కలిచివేస్తోంది. ప్రతీకాత్మక చిత్రం మానసిక స్థితి దిగజారిపోతుంది: డిప్రెషన్ అనేది మూడ్ డిజార్డర్. ఒక వ్యక్తి నిరంతరం విచారం లేదా తక్కువ మానసిక స్థితిని కలిగి ఉంటాడు. ఇది వివిధ కారణాల వల్ల జరగవచ్చు. కానీ డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తులు నెమ్మదిగా ప్రతిదానిపై ఆసక్తిని కోల్పోతారు. ప్రతిదీ అర్ధంలేనిదిగా భావిస్తారు. కోపంగా ఉండడం, విచారంగా అనిపించడం, నిద్ర భంగం, ఆసక్తి కోల్పోవడం డిప్రెషన్‌కి సంబంధించిన కొన్ని లక్షణాలు. అయితే కొంతమంది మాత్రం డిప్రెషన్‌తో బాధపడుతున్నా బయట ప్రపంచానికి అది కనపడనివ్వరు.. నవ్వుతూ కనిపిస్తారు. లోలోపల వారు పడే బాధ ఎవరికి కనిపించదు. ఇది కూడా డిప్రెషన్‌లో భాగమే.. కోపం, చికాకు డిప్రెషన్‌కి సంబంధించిన లక్షణాలే కానీ.. అవి బయటపడినంత మాత్రానా మనం డిప్రెషన్‌తో ఉన్నట్టు కాదు. జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి లక్షణాలు మనకు ఎదురువుతాయి. ప్రతీకాత్మక చిత్రం నిపుణులు ఏం చెబుతున్నారు? మానసిక ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, విద్యార్థుల ఆత్మహత్యలకు పలు కారణాలుంటాయి. అకడమిక్ స్ట్రెస్, యాంగ్జయిటీ, డిప్రెషన్, పీర్ ప్రెజర్, రిలేషన్ షిప్ సమస్యలు లాంటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కారణలు ఉంటాయి. బోర్డు పరీక్ష ఒత్తిడి, భయం, పనితీరుపై ఆందోళన కూడా అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి పాఠశాలలు పోటీ-ఆధారితమైనవి. తీవ్రమైన ఒత్తిడి స్వీయ-వినాశనం లాంటి ఆకస్మిక, హఠాత్తుగా, తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి దారితీస్తుంది. విద్యార్థుల కెరీర్ పట్ల సమాజం, తల్లిదండ్రుల దృక్పథం మారాల్సిన అవసరం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. 'విద్యార్థులు జీవితంలో భాగంగా, విజయంతో పాటు వైఫల్యాలను ఫేస్ చేయడాన్ని తల్లిదండ్రులు, టీచర్లు నేర్పించాలి. మెడికల్, ఇంజనీరింగ్ కాకుండా అనేక కెరీర్ ఎంపికలు ఉన్నాయని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. తమ పిల్లలను వారి ప్రతిభ, ఆప్టిట్యూడ్ , అకడమిక్స్‌లో ఎల్లప్పుడూ ప్రోత్సహించాలి. విద్యార్థుల ఆత్మహత్యల లాంటి దురదృష్టకర ఘటనలను అరికట్టేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం మొత్తం కలిసికట్టుగా కృషి చేయాలి. ప్రతీకాత్మక చిత్రం అటు విద్యార్థులు కూడా ఓవర్ థింకింగ్‌ని మానుకోవాలి. మనకు సంతోషాన్ని కలిగించే పనులు తరచుగా చేయాలి. మనకు సంతోషాన్ని కలిగించే లేదా డ్యాన్స్ చేయాలనుకునే పాటల ప్లే జాబితాని మనం రూపొందించాలి. మనం దిగులుగా అనిపించే సమయాల్లో, పాటలను ప్లే చేయాలి. మానసిక స్థితిని నెమ్మదిగా నయం చేయాలి. కొత్త విషయాలను నేర్చుకునేందుకు ప్రయత్నించండి. డిప్రెషన్‌ని ఎట్టి పరిస్థితిలోనూ లైట్ తీసుకోవద్దు. సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించాల్సిందే...! ALSO READ: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని కూతురు.. సూసైడ్..!! #depression #vijay-antony మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి