Bathukamma celebrations: ఆంధ్రా అమ్మాయిల బతుకమ్మ అదుర్స్..గోదారోళ్ల బతుకమ్మ మామూలుగా లేదుగా

తెలుగు రాష్ట్రాల్లో బతుకమ్మ పండుగ ఘనంగా చేసుకుంటున్నారు. ఊరు, వాడ, పట్టణం బతుకమ్మ పాటలతో మార్మోగుతుంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి జిల్లాలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు.

New Update
Bathukamma celebrations:  ఆంధ్రా అమ్మాయిల బతుకమ్మ అదుర్స్..గోదారోళ్ల బతుకమ్మ మామూలుగా లేదుగా

తెలుగు రాష్ట్రాల్లో బతుకమ్మ పండుగ ఘనంగా చేసుకుంటున్నారు. ఊరూవాడ ఎక్కడ చూసినా.. బతుకమ్మ పాటలతో మార్మోగుతుంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజానగరంలోని ఐఎస్టీఎస్ కళాశా (ISTS College)లో సుమారు 15 వందల మంది విద్యార్థులతో బతుకమ్మ పండుగ (Bathukamma festival) చేసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: దమ్ముంటే నేను ఖమ్మంలో ఉన్నప్పుడు ఆ పని చేయండి: తుమ్మల, పొంగులేటిపై పువ్వాడ ఫైర్

తెలుగుదనం ఉట్టిపడేలా తెలంగాణా(Telangana)లో బోనాలు, బతుకమ్మ పండుగలు ప్రతి ఏటా జరుపుకుంటున్నారు. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏ మాత్రం తీసిపోలేదు. తెలంగాణ కన్నా రెండింతలు ఉత్సాహంతో అటు బోనాలను, ఇటు బతుకమ్మ సంబరాలు జరుపుతున్నారు తూర్పుగోదావరి జిల్లాలోని వాసులు. ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న సమయంలో రాజానగరంలోని ఐఎస్టీఎస్ కళాశాలో సుమారు 15 వందల మంది విద్యార్థినులతో తెలుగింటి సాంప్రదాయ దుస్తులతో బతుకమ్మకు వన్నెతెచ్చేలా విభిన్న పుష్పాలతో అలంకరణ చేసి, నృత్యాలతో అలరించారు.

ఇది కూడా చదవండి: ఏలూరులో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు… ఆన్‌లైన్ పేరుతో టోకరా

సుమారు100 వరకు బతుకమ్మలను ఏర్పాటు చేసి ఘనంగా ఆడి పాడారు.. చూసేందుకు రెండు కళ్ళు చాలనంతగా కనువిందు చేశారు. కలశాల ప్రిన్సిపాల్, కరెస్పాండెంట్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా బతుకమ్మను సంబరాలుగా జరుపుకుంటామని వారు తెలిపారు. విద్యార్థినులు బతుకమ్మ సంబరాలు ఇలా కళాశాలలో కాకుండా, ప్రతీ ఇంటా జరుపుకోవాలని, మేము ఖచ్చితంగా ప్రతీ ఏటా తమతమ ఇళ్ల దగ్గర ఇలానే జరుపుకుంటామని సంతోషం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: పోలీసుల అదుపులో మావోయిస్టులు.. మందుగుండు సామగ్రి స్వాధీనం

ఈ కార్యక్రమంలో విద్యార్థినిలు, మహిళలు పాల్గొని ఆట, పాటలతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీ లెక్చరర్ మాట్లాడుతూ.. పిల్లలు బతుకమ్మ ఫెస్టివల్‌ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా పూలకు సంబంధించిన ఫెస్టివల్ కాబట్టి ప్రతి విద్యార్థిని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పండగ ముఖ్యంగా ఆడపిల్లలు చేయాల్సిన పండగ అని, కాలేజీలో ఫస్ట్ టైం బతుకమ్మ పండగ చేయడం ఆనందంగా ఉందని విద్యార్థినిలు అంటున్నారు. ఇకపై ప్రతీ సంవత్సరం ఇలాగే జరుపుకుంటాం అని విద్యార్థినిలు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు