సృష్టిలో ప్రతి జీవిది బ్రతుకు పోరాటమే... బ్రతుకుతో ప్రత్యక్ష సంబంధం ఉన్న పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండగ ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధాన్ని స్పష్టంగా వివరించి చెబుతుంది. ప్రత్యేకంగా తెలంగాణ ఆడపడుచులకు అన్ని పండల కంటే పెద్ద పండగ బతుకమ్మ పండగ. స్త్రీలలో ఉన్న అద్వితీయమైన శక్తిని వెలికితీస్తుంది. తెలంగాణ స్త్రీల గుండె బతుకమ్మ. బతుకమ్మ పండగ గురించి అందరకీ తెలుసు. కానీ బతుకమ్మ కంటే ముందు నిర్వహించే బొడ్డెమ్మ పండగను చేయడం పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం.
ఇదికూడా చదవండి: పిల్లలు డెంగ్యూ భారిన పడకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు పాటించండి..
బొడ్డెమ్మ పండగను పెళ్లికావాల్సిన కన్నెపిల్లలు బొడ్డెమ్మను పూజిస్తుంటారు. సుమంగళి భాగ్యం కోసం ముత్తయిదువలు సద్దుల బతుకమ్మను పేర్చుతారు. గౌరిదేవి బొడ్డెమ్మ రూపంలో అవతరించి సకల ప్రాణాలకు, బాలలకు సంతోషాన్ని ఇస్తుంది. బొడ్డెమ్మ పండగను మూడు రోజుల పాటు నిర్వహించిన అనంతరం ఎంగిలిపువ్వు బతుకమ్మతో...బతుకమ్మ పండగ ప్రారంభం అవుతుంది. ఈ రెండు పండగలకు ఒకదానితో ఒకటి సంబంధం ఉంటుంది. ఈ రెండు కూడా గౌరీదేవి రూపాలే. బొడ్డెమ్మ పిల్లలందరికీ ఇష్టమైన పండగ. బొడ్డెమ్మ అంటే ధాన్యపురాశి అని అర్థం. ఈ బొడ్డెమ్మను సాయంత్రం సంధ్యా సమయంలో పుట్టమన్ను తీసుకువచ్చి తొమ్మిది దొంతరలు లేదా మూడు, లేదా ఐదు తయారు చేసి ఎర్రమట్టితో అలికి తయారు చేస్తారు. తెలంగాణలోనూ ఒక్కోప్రాంతంలో ఒక్కోవిధంగా తయారు చేస్తారు. కొన్ని చోట్ల ఆవుపేడతో, కొన్ని చోట్ల ఎర్రమట్టితో, మరికొన్ి చోట్ల చెక్కపీటకు పూజిస్తుంటారు. బొడ్డెమ్మను అలంకరించి పిల్లలందరూ చుట్టు చేరి ఆడుతూ పాడుతూ బొడ్డెమ్మ రూపంలో ఉన్న గౌరవమ్మను పూజిస్తుంటారు.
ఈ పాటను పాడుతూ...బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతుంటారు:
బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్…
బిడ్డాలెందారేదారే కోల్…
నీ బిడ్డ నీల గౌరు కోల్ -…
నిత్య మల్లె చెట్టేసి కోల్ ….
నిత్యమల్లె చెట్టూకు కోల్…
నిత్యం నీళ్ళు పోసి కోల్…
కాయలు బిందెలు కోల్….
ఘనమైన కాతా కోల్ ….
కాయలన్నీ దింపి కోల్ ….
కడవల్లా పోసి కోల్….
తెంపిన కాయల్లు కోల్…..
బండికి ఎత్తంగా కోల్…
పోయేనే ఆ బండి కోల్ ….
ఐలోని దాకా కూల్ …..
ఐలోని మల్లన్న కోల్….
పండ్లోయి పండ్లు కోల్…..
ఏమి పండ్లో కానీ కోల్….
ఎంతో గుమగుమ కోల్….
చూసేటోరేగాని కోల్…
కొనేటోరు లేరు కోల్….
ఆ నుండి ఆ బండి కోల్….
కొమ్మాలా దాక కోల్…..
కొమ్మాల నరసింహ స్వామి కోల్ ….
పండ్లోయి పండ్లు కోల్..
ఈరోజు అమ్మవారికి చక్కెర, పప్పు, అటుకులు, బెల్లం, ఇలా నైవేద్యంగా సమర్పిస్తారు.