Daily Bath : భారతదేశం(India) లో దాదాపు అందరు రోజూ స్నానం చేస్తారు. అయితే, ప్రపంచం(World) లోని ఇతర దేశాలలో ఇలా లేదు. ప్రపంచ దృష్టికోణం నుండి చూస్తే, అమెరికన్ల(Americans) లో మూడింట ఒక వంతు మంది ప్రతిరోజూ స్నానం(Bathing) చేస్తారు. ఆస్ట్రేలియాలో, 80 శాతం మంది ప్రతిరోజూ స్నానం చేస్తారు, కానీ చైనాలో, సగం కంటే ఎక్కువ మంది ప్రతిరోజూ స్నానం చేయరు. వారానికి రెండు రోజులు మాత్రమే స్నానం చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో రోజూ స్నానం చేయకూడదా అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. భారతదేశంలోని చాలా మంది ప్రజలు ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల మనల్ని శుభ్రంగా ఉంచుతుందని, అది మన శరీరంలోని మురికిని తొలగిస్తుందని నమ్ముతారు. అందువల్ల, భారతదేశంలో ఎవరైనా ప్రతిరోజూ స్నానం చేయకూడదని చెబితే, వారు దానిని ఎగతాళి చేస్తారు, కానీ పాశ్చాత్య ప్రపంచంలోని వైద్యులు రోజూ స్నానం చేయడం అనవసరమని చెబుతారు.
BBC నివేదికలో, పర్యావరణవేత్త డోనాచాద్ మెక్‌కార్తీ ప్రతిరోజూ స్నానం చేయడం ఒక సామాజిక ఆచారం మాత్రమే అని చెప్పారు. స్నానం చేయడం వల్ల శరీర దుర్వాసన తొలగిపోతుందనే నమ్మకం సమాజంలో ఉంది. కానీ ఇందులో వాస్తవం లేదు. ఇలా చేయకుంటే అనారోగ్యం బారిన పడతామని సమాజం చెప్పినందుకే ఇలా చేస్తున్నామని అన్నారు. అందుకే భయపడుతున్నాం. మెక్‌కార్తీ స్వయంగా నెలలో రెండు రోజులు మాత్రమే స్నానం చేస్తాడు. అమెజాన్ అడవుల్లో ఉన్న యానోమామి గిరిజనులతో కలిసి రెండు వారాల పాటు గడిపాడు. ఈ గిరిజనులు కూడా స్నానం చేయరు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత రోజూ స్నానం చేయడం మానేశాడు.
చర్మంలో ఉండే మిలియన్ల కొద్దీ మంచి బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు చర్మాన్ని కాపాడతాయని మనకు తెలుసు, కానీ భారతదేశం వంటి దేశాల్లో, దుమ్ము కాలుష్యం చాలా ఎక్కువగా.. దుమ్ము కాలుష్యం చర్మానికి ఎక్కువగా అంటుకుంటే, అది హానికరం. చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ జోసీ పార్క్ న్యూయార్క్ టైమ్స్‌లో మాట్లాడుతూ, మీరు ఎంత తరచుగా స్నానం చేస్తారు అనేది మీ శరీరం చెమటపై ఆధార పడి ఉంటుందని అన్నారు. ఇవి ఎక్కువగా ఉంటే స్నానం చేయడం కూడా తప్పనిసరన్నారు.
Also Read : డేగ దృష్టి కావాలంటే ఇవి తినండి